AP Inter Supplementary Result 2025: విద్యార్థులకు శుభవార్త – ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల తేదీ ఇదేనా?

AP Inter Supplementary Result 2025: విద్యార్థులకు శుభవార్త – ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల తేదీ ఇదేనా?
x

AP Inter Supplementary Result 2025: విద్యార్థులకు శుభవార్త – ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల తేదీ ఇదేనా?

Highlights

AP ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2025 జూన్ 8 నుండి 10 మధ్య విడుదలయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ లేదా వాట్సాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఫలితాల తేదీపై తాజా సమాచారం తెలుసుకోండి.

AP Inter Supplementary Result 2025: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు 2025 మే 12 నుంచి మే 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు రాసిన వేలాది మంది విద్యార్థులు ఫలితాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, వారి ఎదురుచూపులకు త్వరలోనే ముగింపు కలుగనుంది. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు జూన్ మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. అధికారులు ప్రస్తుతం ఫలితాల ప్రక్రియను తుదిదశకు తీసుకెళ్తున్నారు.

జూన్ 8-10 మధ్యలో ఫలితాలు విడుదల కావచ్చు:

ఈఏపీసెట్, నీట్, జేఈఈ వంటి కీలక ప్రవేశ పరీక్షల కౌన్సెలింగ్‌లు ప్రారంభంకాబోతుండటంతో, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలను వీలైనంత త్వరగా విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. అందువల్లే జూన్ 8వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో ఎప్పుడైనా ఫలితాలు విడుదల అయ్యే అవకాశం ఉంది.

ఫలితాలు ఇలా తెలుసుకోండి:

ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో తన హాల్‌టికెట్ నంబర్‌ను ఉపయోగించి చెక్ చేయవచ్చు. అలాగే, "మనం మిత్ర" వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా కూడా ఫలితాలను తెలుసుకునే అవకాశం ఉంది.

ఇంప్రూవ్‌మెంట్, ఫెయిల్ విద్యార్థులకు అవకాశం:

ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరాల్లో ఫెయిలైన విద్యార్థులతోపాటు మార్కులు మెరుగుపర్చుకోవాలనుకున్న విద్యార్థులు ఈ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు విజయవంతంగా ముగియడంతో, ఫలితాల కోసం ఎదురుచూపులు మొదలయ్యాయి.

ఇంకా ఒక ముఖ్యమైన అప్‌డేట్:

ఇకపోతే తెలంగాణలోని TS ICET 2025 పరీక్షల అడ్మిట్ కార్డులు కూడా తాజాగా విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షలు జూన్ 8, 9 తేదీల్లో రెండు సెషన్లలో జరగనున్నాయి. AICTE గుర్తింపు పొందిన MBA, MCA కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories