AP Inter: వాట్సప్ లో ఏపీ ఇంటర్ హాల్ టికెట్స్...టెన్త్ కూడా

AP Inter: వాట్సప్ లో ఏపీ ఇంటర్ హాల్ టికెట్స్...టెన్త్ కూడా
x
Highlights

AP Inter: ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్లను వాట్సప్ గవర్నెన్స్ లో అందించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులు వాట్సాప్ ద్వారా శుక్రవారం...

AP Inter: ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్లను వాట్సప్ గవర్నెన్స్ లో అందించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులు వాట్సాప్ ద్వారా శుక్రవారం నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఫీజులు చెల్లించలేదని ప్రైవేట్ కాలేజీలు హాల్ టికెట్లు ఆపేయడం వంటి ఘటనలు లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వాట్సప్ గవర్నెన్స్ ద్వారా 161 సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి 10 లక్షలకు పైగా విద్యార్థులు ఉన్నారు. వాట్సప్ నెంబర్ 9552300009 ద్వారా వారంతా హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. త్వరలో 10వ తరగతి విద్యార్థులకు కూడా ఇలాంటి అవకాశం కల్పించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని ఇంటర్మీడియెట్ విద్యామండలి కార్యాలయానికి అనుసంధానం చేయనున్నారు. ఈనెల 10 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు కూడా జరగనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories