ఈనెల 12న ఇంటర్‌ ఫలితాలు

ఈనెల 12న ఇంటర్‌ ఫలితాలు
x
Highlights

ఈనెల 12న ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్‌ ఫలితాలను సచివాలయంలో విడుదల చేయనున్నట్లు ఇంటర్‌ విద్యా ప్రిన్సిపల్ సెక్రటరీ బి.ఉదయలక్ష్మి తెలిపారు. ఈ ఏడాది...

ఈనెల 12న ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్‌ ఫలితాలను సచివాలయంలో విడుదల చేయనున్నట్లు ఇంటర్‌ విద్యా ప్రిన్సిపల్ సెక్రటరీ బి.ఉదయలక్ష్మి తెలిపారు. ఈ ఏడాది మొదటిసారిగా ఇంటరు ఫలితాలను గ్రేడింగ్‌ విధానంలో విడుదల చేస్తున్నారు. గతేడాది మొదటి సంవత్సరానికి గ్రేడింగ్‌ విధానం అమలు చేయగా..

ఈసారి రెండో ఏడాది ఫలితాలను గ్రేడింగ్‌లో విడుదల చేస్తున్నామని ఆమె తెలిపారు. విద్యార్థులు కొంతమంది మార్కుల కారణంగా ఒత్తిడికి లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. ఈ నేపథ్యంలో వారిపై ఒత్తిడిని తగ్గించేందుకు ఇంటరు విద్యాశాఖ గ్రేడింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టినట్టు ఉదయలక్ష్మి తెలిపారు. కాగా ఫిబ్రవరి 27నుంచి ప్రారంభమైన పరీక్షలు మార్చి 18తో ముగిశాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories