ఇంటెలిజెన్స్‌ డీజీ పోస్టు కోసం ముగ్గురిని ప్రతిపాదించిన ఏపీ ప్రభుత్వం

ఇంటెలిజెన్స్‌  డీజీ పోస్టు కోసం ముగ్గురిని ప్రతిపాదించిన ఏపీ ప్రభుత్వం
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్‌ డీజీ పోస్టు కోసం కేంద్ర ప్రభుత్వానికి ముగ్గురు ఏడీజీ స్థాయి అధికారుల పేర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతిపాదించారు....

ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్‌ డీజీ పోస్టు కోసం కేంద్ర ప్రభుత్వానికి ముగ్గురు ఏడీజీ స్థాయి అధికారుల పేర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతిపాదించారు. అందులో నళినీ ప్రభాత్‌ (1992బ్యాచ్) ఏడీజీ ఆపరేషన్స్ , కుమార్‌ విశ్వజిత్ (1994బ్యాచ్) చైర్మన్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు , కృపానంద త్రిపాఠి ఉజెలా (1994 బ్యాచ్) ఏడీజీ, హోమ్ గార్డులు లు ఉన్నారు. ఈ జాబితాను ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు ప్రధాన కార్యదర్శి. జాబితాలోని ఈ ముగ్గురిపై ఎలాంటి విచారణలు పెండింగ్‌లో లేవని ఆయన స్పష్టం చేశారు.

ఇదిలావుంటే ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఇంటెలిజెన్స్‌ మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరావును కేంద్ర ఎన్నికల కమీషన్ బదిలీ చేసింది. ఆయన తోపాటుగా కడప, శ్రీకాకుళం ఎస్పీలను కూడా బదిలీ చేసింది. అయితే ఈ బదిలీలు ఆపాలని ఏపీ ప్రభుత్వం ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేసింది. విచారణ అనంతరం ఎన్నికల కమీషన్ తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది.

Show Full Article
Print Article
Next Story
More Stories