ఏపీలో మానవహక్కుల సంఘం తేల్చింది

ఏపీలో మానవహక్కుల సంఘం తేల్చింది
x
Highlights

ఇటీవల పల్నాడు ప్రాంతమైన ఆత్మకూరు తదితర గ్రామలలోని టీడీపీ నేతలపై వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని.. అమాయకుల ప్రాణాలు తీస్తున్నారని టీడీపీ...

ఇటీవల పల్నాడు ప్రాంతమైన ఆత్మకూరు తదితర గ్రామలలోని టీడీపీ నేతలపై వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని.. అమాయకుల ప్రాణాలు తీస్తున్నారని టీడీపీ ఆరోపించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో వైసీపీ బాధితులు అంటూ టీడీపీ శిభిరాన్ని ఏర్పాటు చేసింది. అంతేకాదు మానవ హక్కుల సంఘాన్ని కూడా ఆశ్రయించింది టీడీపీ. దీంతో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని వచ్చిన ఫిర్యాదులపై మానవహక్కుల సంఘం విచారణ జరిపింది. ఆ ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని స్వయంగా తెలుసుకుంది. ఫైనల్ గా నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించిందని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. వారు అన్ని విషయాలు పరిశీలించి ఈ గ్రామాలలో ఎవరిని బెదిరించి ఊళ్ల నుంచి బయటకు పంపలేదని నివేదిక వచ్చిందని ఆమె చెప్పారు.

పోలం పనులపై వెళ్లినవారిని కూడా భయపెట్టి పంపినట్లు ఆరోపించారని, అవి వాస్తవం కాదని కమిషన్ సభ్యులు తేల్చి చెప్పారని ఆమె అన్నారు. ఇకనైనా టీడీపీ ఇలాంటి రాజకీయాలు మానుకోవాలని ఆమె హితవు పలికారు. ఇటీవల తాము అగ్రిగోల్డ్ భాదితులకు న్యాయం చేస్తే ఆ ఘనతను కూడా టీడీపీ ఖాతాలోకే వేసుకునేలా మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. ఈ విషయంలో కూడా చంద్రబాబు చేస్తున్నప్రచారం అర్దం లేనిదని, ఆయన ఐదేళ్లు అదికారంలో ఉండి కూడా అగ్రిగోల్డ్ బాదితులను ఆదుకోలేకపోయారని సుచరిత అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories