హైకోర్టులో చంద్రబాబు సర్కార్ కు చుక్కెదురు

హైకోర్టులో చంద్రబాబు సర్కార్ కు చుక్కెదురు
x
Highlights

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చంద్రబాబు సర్కారుకు చుక్కెదురైంది. ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఇద్దరు ఐపీఎస్ ల బదిలీ ఆపాలంటూ దాఖలైన పిటిషన్ పై జోక్యం చేసుకోలేమని...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చంద్రబాబు సర్కారుకు చుక్కెదురైంది. ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఇద్దరు ఐపీఎస్ ల బదిలీ ఆపాలంటూ దాఖలైన పిటిషన్ పై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది హైకోర్టు. ఇది ఎన్నికల కమీషన్ పరిధిలోని అంశమని.. ఈసీ తీసుకున్న నిర్ణయం విషయంలో జోక్యం చేసుకోలేమని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు తెలిపింది. కాగా ఆంధ్రప్రదేశ్‌ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం, కడప ఎస్పీలు అడ్డాల వెంకటరత్నం, రాహుల్‌దేవ్‌శర్మలను ఎన్నికల సంఘం మంగళవారం రాత్రి బదిలీ చేసింది.

వారిని పోలీసు ప్రధాన కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత ఎన్నికలు పూర్తయ్యేంతవరకూ ఆయనకు ఎలాంటి ఎన్నికల విధులు, బాధ్యతలు అప్పగించరాదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు బదిలీని రద్దు చేసింది ఏపీ ప్రభుత్వం. మరోవైపు హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందో అని ఉత్కంఠ నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories