వైఎస్ వివేకా హత్య కేసు సీబీఐకి ఇచ్చేందుకు అభ్యంతరాలేంటి : హైకోర్టు

వైఎస్ వివేకా హత్య కేసు సీబీఐకి ఇచ్చేందుకు అభ్యంతరాలేంటి : హైకోర్టు
x
Highlights

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐకు ఇవ్వాలని దాఖలైన వాజ్యాన్ని హైకోర్డు విచారణకు స్వికరించింది

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐకు ఇవ్వాలని దాఖలైన వాజ్యాన్ని హైకోర్డు విచారణకు స్వికరించింది. సీబీఐకి అప్పగించేందుకు ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరాలేంటో చెప్పాలని ప్రశ్నించింది. ఈ వాజ్యాలపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభత్వాన్ని ఆదేశించింది. దీనిపై అడ్వొకేట్ జనరల్ అందుబాటులో లేరు దీంతో ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 6వ తేదీకి వాయిదా వేసింది.

ఈ కేసును సీబీఐకి అప్పగించాలని వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పుడు కొత్తగా నాలుగో పిటిషన్‌ వైఎస్‌ వివేకా కుమార్తె సునీతమ్మ దాఖలు చేశారు. అయితే అన్ని పిటిషన్లను ధర్మాసనం ఇవాళ విచారించింది. సీబీఐకి అప్పగించాలని పిటిషన్లు చేసిన వారిలో ప్రస్తుత సీఎం వైఎస్ జగన్‌‌ కూడా ఒకరు.. సీబీఐకి ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరాలను తెలపాలని కోర్టు ప్రశ్నించింది.

వైఎస్‌ వివేకా కుమార్తె సునీతమ్మ దాఖలు వ్యాజ్యాన్ని కూడా మిగతా వాటితో కలిపి విచారిస్తామని ఉన్నత కోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఈ కేసులో సిట్‌ విచారణ తుది దశలో ఉందిని గతంలోనే కోర్టుకు ఏజీ తెలిపారు. సిట్ విచారణలో పురోగతి లేదని, సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్ వివేకానంద రెడ్డిసతీమణి హైకోర్టులో వ్యాజ్యాం దాఖలు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories