గ్రూప్ -1 అభ్యర్థుల పరీక్షల కేసు తీర్పు రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు

AP High Court Reserves Judgment in Group-1 Candidates Examination Case
x

ఏపీ హై కోర్ట్ (ఫైల్ ఇమేజ్)

Highlights

AP High Court: అభ్యర్థుల మెయిన్స్ పేపర్ కరెక్షన్ ప్రైవేట్ ఏజెన్సీచేయటాన్ని.. సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌పై విచారణ

AP High Court: గ్రూప్ -1 అభ్యర్థుల పరీక్షల కేసు తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది. అభ్యర్థుల మెయిన్స్ పేపర్ కరెక్షన్‌ను ప్రైవేట్ ఏజెన్సీ చేయటాన్ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ప్రభుత్వానికి సంబంధించిన బాడీ చేయాల్సిన పనిని.. ప్రైవేట్ సంస్థ టీసీఎస్ చేయడం సరికాదని పిటిషనర్లు హైకోర్టుకు తెలిపారు. ఏపీపీఎస్సీకి ఈ అధికారం లేదని.. ప్రైవేట్ ఏజన్సీకి పేపర్ కరెక్షన్‌కి ఇస్తామని ముందు చెప్పలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. అయితే.. దీనిపై ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు.. తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories