AP High Court: కరోనా పరిస్థితులపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

AP High Court key Comments on Corona Conditions
x

ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ (ఫైల్ ఇమేజ్)

Highlights

AP High Court: అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో కోవిడ్ మరణాలపై రిపోర్టు ఇవ్వాలని ఆదేశం

AP High Court: కరోనా పరిస్థితులపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో కోవిడ్ మరణాలపై రిపోర్టు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే.. రాష్ట్ర ప్రభుత్వం కోరిన ఆక్సిజన్‌ను ఇచ్చేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆక్సిజన్ దూర ప్రాంతాల నుంచి కాకుండా రాష్ట్రానికి దగ్గరగా ఉన్న బళ్లారి, తమిళనాడు నుంచి అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

మరోవైపు.. ఆక్సిజన్ స్వయం సమృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన న్యాయస్థానం కోవిడ్ కేర్ సెంటర్లు, బెడ్లు పెంచాలని ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు నోడల్ అధికారులు 24 గంటలూ అందుబాటులో ఉండాలని ఆదేశించింది. అటు వ్యాక్సినేషన్‌పైనా న్యాయస్థానం ఆరా తీసింది. అందరికీ వ్యాక్సిన్ వేయడంలో ఇబ్బందులు ఏంటని ప్రశ్నించిన కోర్టు తదుపరి విచారణ వెకేషన్ బెంచ్ కోర్టుకు వాయిదా వేసింది.


Show Full Article
Print Article
Next Story
More Stories