Breaking News: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు గ్రీన్‌సిగ్నల్

AP High Court Green Signal To ZPTC and MPTC Elections Counting held on April 8 2021 | Breaking News
x

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు గ్రీన్‌సిగ్నల్

Highlights

Breaking News: ఏపీలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Breaking News: ఏపీలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం తీర్పును ఇచ్చింది. ఈ ఎన్నికలను సమర్ధించిన ధర్మాసనం.. సింగిల్ జడ్జి తీర్పును కొట్టేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 1న ఎస్ఈసీ నీలం సాహ్ని ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా ఈ ఏడాది ఏప్రిల్ 8న ఎన్నికలు నిర్వహించారు. ఏప్రిల్ 10న కౌంటింగ్ నిర్వహించాల్సి ఉంది.

పోలింగ్ తేదీకి 4 వారాల ముందే ఎన్నికల కోడ్ విధించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా నోటిఫికేషన్ ఇచ్చిన వారానికే ఎన్నికలు నిర్వహించారంటూ గతంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు మే 21న ఏకసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఎస్ఈసీ, ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు హైకోర్టులో అప్పీళ్లు వేశారు. వాటిపై ఆగస్టు 5న విచారణ జరిపిన ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. తాజాగా ఓట్ల లెక్కింపునకు పచ్చజెండా ఊపుతూ తీర్పును వెల్లడించింది. దీంతో ఓట్ల కౌంటింగ్‌కు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసుకునేందుకు కసరత్తులు మొదలుపెట్టింది.

Show Full Article
Print Article
Next Story
More Stories