AP High Court: రాజధాని కేసులపై విచారణ వాయిదా

AP High Court: *జనవరి 28కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు *ఆరోజు పూర్తిస్థాయి వాదనలు వింటామన్న ధర్మాసనం

Sandeep Eggoju
Updated on: 27 Dec 2021 3:14 PM IST
AP High Court Adjourns Hearing on Capital Cases | AP News Today
X

రాజధాని కేసులపై విచారణ వాయిదా

AP High Court: రాజధాని కేసులపై దాఖలైన పిటిషన్లపై విచారణ మరోసారి వాయిదా పడింది. జనవరి 28కి ఏపీ హైకోర్టు విచారణను వాయిదా వేసింది. ఆ రోజు నుంచి పూర్తిస్థాయి వాదనలు వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. రైతుల తరఫున వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది శ్యాం దివాన్‌ పిటిషన్లపై విచారణ కొనసాగాలని కోర్టును కోరారు.

సీఆర్‌డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ చట్టాలను ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో పిటిషన్లలో ఇంకా కొనసాగాల్సిన అంశాలు ఏమున్నాయనే వివరాలను పది రోజుల్లోగా నోట్లు దాఖలు చేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులను కోర్టు ఆదేశించింది. అనంతరం ప్రభుత్వం అఫిడవిట్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story