ఏపీలో మందు బాబులకు షాక్‌.. భారీగా పెరిగిన మద్యం ధరలు

ఏపీలో మందు బాబులకు షాక్‌.. భారీగా పెరిగిన మద్యం ధరలు
x
Highlights

ఏపీలో ప్రైవేటు మద్యం దుకాణాలకు తెరపడింది. సర్కారీ మద్యం దుకాణాలు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. కొన్ని దశాబ్ధాలుగా ప్రైవేటు లైసెన్సీల చేతిలో ఉన్న...

ఏపీలో ప్రైవేటు మద్యం దుకాణాలకు తెరపడింది. సర్కారీ మద్యం దుకాణాలు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. కొన్ని దశాబ్ధాలుగా ప్రైవేటు లైసెన్సీల చేతిలో ఉన్న మద్యం వ్యాపారం సంపూర్ణంగా ప్రభుత్వం చేతికి వచ్చింది. దీంతో మద్యం విక్రయాలు ఇక నుంచి ఉదయం 11 నుంచి రాత్రి 8గంటల వరకే పరిమితం కానున్నాయి.

నేటి నుంచి రాష్ట్రంలో మద్యం షాపులను రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ద్వారా ప్రభుత్వమే నిర్వహించనుంది. అంతవరకే ఆగకుండా మొదటి విడతలో భాగంగా 20 శాతం షాపుల లైసెన్సులను రద్దు చేసింది. అంటే ఇప్పటివరకు రాష్ట్రంలో 4 వేల 380 మద్యం షాపులుండగా ఇవాళ్టి నుంచి 3 వేల 500 షాపులు మాత్రమే తెరుచుకోనున్నాయి.

ఇక పట్టణాలు, నగరాల్లోని మద్యం దుకాణాల్లో ఒక సూపర్ వైజర్, ముగ్గురు సేల్స్‌మెన్ ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఒక సూపర్ వైజర్, ఇద్దరు సేల్స్‌మెన్ పనిచేస్తారు. పర్యవేక్షణ బాధ్యత ఆ పరిధి ఎస్సై, సీఐలకు అప్పగించారు. ఇదివరకే గ్రామాలు, పట్టణాల్లో బెల్ట్ షాపులు, పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేసిన సర్కారు అమ్మకాలు కూడా పరిమితం చేసింది. ఒకరికి గరిష్టంగా మూడు బాటిళ్ల మద్యం మాత్రమే అమ్ముతారు. అంతకంటే ఎక్కువ మద్యం సీసాలు లభిస్తే చర్యలు తీసుకుంటారు.

అలాగే మద్యం ధరలను కూడా భారీగా పెంచారు. అడిషనల్‌ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ పేరుతో ఒక్కో బాటిల్‌ పై కనిష్టంగా 10 రూపాయలు, గరిష్టంగా 250 రూపాయల వరకు పెంచారు. దేశీయంగా తయారైన విదేశీమద్యం 60 ఎంఎల్, 90 ఎంఎల్ బాటిల్‌పై 10 రూపాయలు, 750 ఎంఎల్ బాటిల్‌పై 80 రూపాయలు, వెయ్యి ఎంఎల్ బాటిల్‌పై 100 రూపాయలు పెంచారు. 650 ఎంఎల్ బీర్ బాటిల్ పై 20 రూపాయలు పెంచారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories