కరోనా బాధితులకు రూ. 2వేల సాయం నిలిపివేత

కరోనా బాధితులకు రూ. 2వేల సాయం నిలిపివేత
x
Highlights

కరోనా బారినపడి వివిధ కోవిడ్ కేర్ సెంటర్లు, క్వారంటైన్‌ కేంద్రాలలో ఉండి కోలుకున్న వారికి 'ఆసరా'..

కరోనా బారినపడి వివిధ కోవిడ్ కేర్ సెంటర్లు, క్వారంటైన్‌ కేంద్రాలలో ఉండి కోలుకున్న వారికి 'ఆసరా' కింద ఇచ్చే రూ.2000 ఆర్థిక సాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిలిపివేసింది. జులై నుంచి కరోనా బాధితులకు ఈ సాయం అందడం లేదు. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో రాష్ట్ర ఖజానాకు ఆర్ధిక భారం కూడా పెరిగింది. దీంతో ఈ సాయాన్ని నిలిపివేసినట్టు అర్ధమవుతోంది. కొవిడ్‌ నుంచి కోలుకున్న వారంతా 2వారాలపాటు ఇళ్లలోనే ఉండి... పౌష్ఠికాహారం తీసుకొనేందుకు వీలుగా ప్రతి ఒక్కరికి రూ.2వేలు అందచేస్తామని సీఎం జగన్‌ ఏప్రిల్‌ లో ప్రకటించారు.

ఈ క్రమంలో ఏప్రిల్, మే , జూన్ నెలల్లో మాత్రమే ఈ సాయం అందజేశారు. ఇందుకోసం రాష్ట్ర ఆర్ధిక శాఖ దాదాపు 20 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. అయితే ప్రస్తుతం జులై నెలనుంచి బాధితుల బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకుంటున్నా... నగదు మాత్రం జమ కావడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే క్వారంటైన్‌ కేంద్రాలు తగ్గి, కొవిడ్‌ కేర్ సెంటర్లు మరింతగా పెరిగాయి. దీంతో ఇళ్లల్లోనే ఉంటూ చికిత్స పొందుతున్న వారి సంఖ్య కూడా పెరిగింది.

మరోవైపు ఆర్ధికసాయం నాలుగు రోజుల నుంచి నిలిపివేశామని అనంతపురం జిల్లా కలెక్టర్‌ చెప్పినట్లు అక్కడి సమాచార శాఖ అధికారులు ప్రకటన జారీ చేయడంతో.. ఈ విషయం బయటకు వచ్చింది. దీంతో మంది ఎక్కువయ్యే కొద్ది మజ్జిగ పలుచన అవుతాయన్న సామెతను ఏపీ ప్రభుత్వం గుర్తుచేసింది. రాష్ట్రంలో ప్రతిరోజు పదివేలకు పైగా కేసులు నమోదు అవుతుండటం వలన రాష్ట్ర ప్రభుత్వం ఈ సాయాన్ని నిలిపివేసిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories