logo

ఏపీ ప్రజలకు భారీ గిఫ్ట్.. ఫించన్ల‌ను డబుల్‌ చేస్తున్నట్టు సీఎం ప్రకటన

ఏపీ ప్రజలకు భారీ గిఫ్ట్.. ఫించన్ల‌ను డబుల్‌ చేస్తున్నట్టు సీఎం ప్రకటన

ఏపీ ప్రజలకు సంక్రాంతి గిఫ్ట్ ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. శుక్రవారం నెల్లూరు జిల్లాలో జరిగిన జన్మభూమి – మన ఊరు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. వృద్ధులు, పేదల ఫించన్ల‌ను డబుల్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఏపీలో ఇస్తున్న 1000 రూపాయల పించన్లను.. రెండు వేలకు పెంచుతున్నట్టు చెప్పారు. నెల్లూరు జిల్లా బోగోలు జన్మభూమి సభలో సీఎం ఈ ప్రకటన చేశారు. జనవరి నుంచే పెంచిన పించన్‌ను చెల్లిస్తామని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు న్యూ ఇయర్‌ కానుకగా ఈ నెల 3వేలు అందిస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. పేదలకోసం ఇంకా చాలా చేయాలని ఉందని, కానీ ఖజనా సహకరించడం లేదన్నారు. అలాగే మోడీ, జగన్‌లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన సీఎం ఇద్దరు కలిసి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి జగన్ సీఎం అయితే పెద్దుబడులు రావని ఆయన ఎద్దేవా చేశారు.

Raj

Raj

Our Contributor help bring you the latest article around you


లైవ్ టీవి

Share it
Top