కేంద్రానికి చేరిన ఏపీ 'శాసన మండలి రద్దు' తీర్మానం.. కేంద్రం నిర్ణయంపై ఉత్కంఠ!

కేంద్రానికి చేరిన ఏపీ శాసన మండలి రద్దు తీర్మానం.. కేంద్రం నిర్ణయంపై ఉత్కంఠ!
x
కేంద్రానికి చేరిన ఏపీ 'శాసన మండలి రద్దు' తీర్మానం
Highlights

శాసన మండలి రద్దు తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపింది రాష్ట్ర ప్రభుత్వం. శాసనసభలో చేసిన తీర్మానం ప్రతితో పాటు ఓటింగ్ కు సంబంధిచిన వివరాలను,...

శాసన మండలి రద్దు తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపింది రాష్ట్ర ప్రభుత్వం. శాసనసభలో చేసిన తీర్మానం ప్రతితో పాటు ఓటింగ్ కు సంబంధిచిన వివరాలను, బిల్లులకు సంబంధించిన అంశాలను రాష్ట్ర ప్రభుత్వానికి శాసన సభ సచివాలయం పంపింది. శాసనసభలో చేసిన తీర్మానం ప్రతితో పాటు ఓటింగ్ కు సంబంధించిన వివరాలు, బిల్లులకు సంబంధిచిన వివరాలనూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి శాసనసభ సచివాలయం పంపింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ చేసిన తీర్మానాన్ని కేంద్ర కేబినెట్ కార్యదర్శికి, హోం, న్యాయశాఖలతో పాటు ఎన్నికల సంఘానికీ రాష్ట్రం ప్రభుత్వం పంపింది. దీంతో కేంద్రం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

ఏపీ శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. కేబినెట్ లో ఆమోదించటం ఆ వెంటనే అసెంబ్లీలో ముఖ్యమంత్రి తీర్మానం, సభలో చర్చ, చివరకు ఓటింగ్ ద్వారా తీర్మానం ఆమోదం, ఇలా మొత్తం వివరాలను అసెంబ్లీ సచివాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక అందింది. దీంతో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అంతే వేగంగా కేంద్రానికి ఈ మొత్తం వివరాలను పంపుతూ తమ తీర్మానం ఆమోదించాలని తదనుగుణంగా రాష్ట్రపతి నుండి ఆమోదం పొందేలా చూడాలని కోరుతూ లేఖలో అభ్యర్ధించారు.

ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఏపీ శాసనసభలో మండలి రద్దు తీర్మానం ఆమోదించింది. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను శాసనమండిలో సెలెక్ట్ కమిటీకి పంపుతూ నిర్ణయం తీసుకోవటం పైన ప్రభుత్వం సీరియస్ అయింది. దీంతో ముఖ్యమంత్రి జగన్ ఏకంగా మండలి రద్దు దిశగా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అనుసరించాల్సిన విధానం మేరకు ముందుగా కేబినెట్ సమావేశమై మండలి రద్దుకు నిర్ణయించింది. ఆ తరువాత అసెంబ్లీ తీర్మానం ప్రతిపాదించి ఆమోదించారు.

నిబంధనల మేరకు రెండో వంతు మెజార్టీ కావాల్సి ఉండటంతో రికార్డు కోసం ఓటింగ్ నిర్వహించగా 133 మంది సభ్యులు మద్దతుగా ఓటింగ్ చేశారు. దీంతో ఇక, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయానికి ఆమోద ముద్ర వేయాల్సి ఉండటంతో శాసన మండలి రద్దు తీర్మానాన్ని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తూనే అందులో స్పష్టంగా జరిగిన పరిణామాలు తమ అభ్యర్ధనలను స్పష్టం చేసింది.

ఇక, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో నిర్ణయం, కార్యచరణ పూర్తి కావటంతో మొత్తం వ్యవహారం కేంద్ర పరిధిలోకి వెళ్లింది. రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ప్రతిని, ఓటింగ్ వివరాలను హోం శాఖ న్యాయ శాఖతో పాటుగా ఎన్నికల సంఘానికి పంపించింది. దీని పైన ఇప్పుడు కేంద్రం ఏ రకంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారుతోంది. మరి కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories