అగ్రిగోల్డ్ బాధితులకు నిధులు విడుదల చేయడంతో వైసీపీ నేతల ర్యాలీ

అగ్రిగోల్డ్ బాధితులకు నిధులు విడుదల చేయడంతో వైసీపీ నేతల ర్యాలీ
x
Highlights

ఎన్నికల హామీ అమలులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అగ్రిగోల్డ్ లో 10 ,000 అంతకంటే తక్కువ మొత్తంలో డిపాజిట్ చేసి మోసపోయిన వారికి సొమ్ము తిరిగి చెల్లించేందుకు

ఎన్నికల హామీ అమలులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అగ్రిగోల్డ్ లో 10 ,000 అంతకంటే తక్కువ మొత్తంలో డిపాజిట్ చేసి మోసపోయిన వారికి సొమ్ము తిరిగి చెల్లించేందుకు వీలుగా 263 .99 కోట్ల రూపాయలు మంజూరు చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు శనివారం సాయంత్రం.. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కేఆర్‌ఎం కిషోర్‌కుమార్‌ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. ఉత్తర్వుల్లో రూ.264,99,00,983 విడుదల చేస్తూ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఈ మొత్తాన్ని మొదట రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రూ.10 వేల లోపు డిపాజిట్లు కలిగిన 3,69,655 మందికి పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.1,150 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. తాజాగా తొలిదశలో ఈ మొత్తాన్ని పలువురు డిపాజిటర్లకు పంపిణీ చేసేలా ఉత్తర్వులు ఇచ్చారు. ఈ సందర్బంగా గుంటూరు లో ర్యాలీ నిర్వహించారు వైసీపీ నేతలు. ర్యాలీలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ గుంటూరు అధ్యక్షులు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీమతి విడదల రజిని ,షేక్ ముస్తఫా,ఉండవల్లి శ్రీదేవీ, నాయకుడు చంద్రగిరి ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories