చంద్రబాబు ఐటీ స్కామ్‌పై రంగంలోకి ఏపీ సీఐడీ

AP Govt Probe Into Chandrababu IT Scam
x

చంద్రబాబు ఐటీ స్కామ్‌పై రంగంలోకి ఏపీ సీఐడీ

Highlights

Chandrababu: గత ప్రభుత్వంలో జరిగిన టెండర్లు, కేటాయింపులపై ఫోకస్

Chandrababu: చంద్రబాబు ఐటీ స్కామ్ పై ఏపీ సీఐడీ రంగంలోకి దిగింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన టెండర్లు, కేటాయింపులపై ఫోకస్ పెట్టింది వైసీపీ సర్కార్. ఐటీ స్కామ్, స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో మూలాలు ఒకేచోట ఉన్నాయన్న దానిపై విచారణకు సిద్ధమైంది. అమరావతి నిర్మాణంలో అంతా అవినీతి జరిగిందని అధికార పార్టీ ముఖ్య నేతలు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే ఇన్‌కమ్ ట్యాక్స్ శాఖ నోటీసులిచ్చిందని టీడీపీపై విమర్శలు ఎక్కుపెట్టారు అధికార పార్టీ నేతలు. చంద్రబాబు అక్రమ ముడుపులకు సంబధించిన 118 కోట్ల రూపాయల లెక్క తేల్చాలని పట్టుబడుతున్నారు వైసీపీ నేతలు.

టిడ్కో ఇళ్ల నిర్మాణంలో రేట్లు పెంచి కంపెనీల నుంచి ముడుపులు స్వీకరించారంటూ ఇప్పటికే అభియోగాలు ఉన్నాయి. నాలుగేళ్లుగా ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాఫ్తు సంస్థ ఐటీ శాఖ విచారణ జరుపుతోంది. స్కిల్ స్కామ్ లోనూ భారీగా అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేసింది. రెండు స్కామ్ లలో భారీగా డబ్బు అందుకున్నట్లు చంద్రబాబు పీఏ శ్రీనివాస్ పై అభియోగాలు మోపింది. రెండు స్కాముల్లోనూ డబ్బు చేరింది ఒక్కరికే అని దర్యాఫ్తు సంస్థలు అంటున్నాయి. దీంతో ఈ స్కామ్ లో ఉన్న వారి మధ్య సంబంధాలపై సీఐడీ దృష్టి సారించింది.

ఇక ఐటీ నోటీసులపై టీడీపీ అధినేత చంద్రబాబు పరోక్షంగా స్పందిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికార పార్టీ ఆరోపణలు సహజమేనంటూ చంద్రబాబు రిప్లయ్ ఇచ్చారు. గతంలో చాలా విచారణలు జరిగాయని, అయినా కూడా ఏం తేల్చలేదని సమాధానమిచ్చారు. ఎన్నికలప్పుడు ఇవి మామూలే అంటూ కొట్టిపారేస్తున్నారు. మరి చంద్రబాబుకు ఐటీ నోటీసులపై వైసీపీ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది. ఆధారాలతో బాబు అండ్ అనుచరులను దోషులుగా నిలబెడతారా? లేక రాజకీయంగా ఎదురుదాడి చేసే పొలిటికల్ స్టంట్ మాత్రమేనా అనే చర్చ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories