మున్సిపల్‌ కార్మిక సంఘాలను మరోసారి చర్చలకు పిలిచిన ఏపీ ప్రభుత్వం

AP Govt Invites Again Sanitation Workers for Discussion
x

మున్సిపల్‌ కార్మిక సంఘాలను మరోసారి చర్చలకు పిలిచిన ఏపీ ప్రభుత్వం

Highlights

Andhra News: ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయంలో చర్చలు

Andhra News: 13 డిమాండ్లను నెరవేర్చాలని సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులతో వైసీపీ ప్రభుత్వం మరోసారి చర్చలు జరపనుంది. ఇప్పటికే రెండు సార్లు జరిపిన చర్చలు విఫలం కావడంతో.. గత వారం రోజులుగా సమ్మను కొనసాగిస్తున్నారు. ఈరోజు 11 గంటలకు మూడోసారి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఛాంబర్‌లో మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ముఖ్య అధికారులతో భేటీ కానున్నారు.

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని.. ఔట్ సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ.. గత వారం రోజులుగా సమ్మెను కొనసాగిస్తున్నారు. కానీ.. ఈ రెండు అంశాలపై ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ ఎటూ తేల్చకుండా నాన్చుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories