దుబాయ్ లులు కంపెనీతో అగ్రిమెంట్ రద్దు.. కారణం ఇదే : మంత్రి గౌతమ్ రెడ్డి

దుబాయ్ లులు కంపెనీతో అగ్రిమెంట్ రద్దు.. కారణం ఇదే : మంత్రి గౌతమ్ రెడ్డి
x
Highlights

గత ప్రభుత్వ హయాంలో దుబాయ్ కంపెనీ లులుతో జరిగిన ఒప్పందాన్ని రద్దు చేసినట్లు ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో దుబాయ్ కంపెనీ లులుతో జరిగిన ఒప్పందాన్ని రద్దు చేసినట్లు ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. లులు కంపెనీకి విశాఖలో కేటాయించిన 13 ఎకరాల భూమిని రద్దు చేస్తున్నట్లు గౌతమ్ రెడ్డి ప్రకటించారు. ఈ భూములు కేటాయించినప్పుడు నెలకు దాదాపు 7కోట్ల రూపాయలు అద్దెగా నిర్ణయించారని కానీ అక్కడ అద్దె 50కోట్లుగా ఉందన్నారు.

ఒకవేళ, గత ప్రభుత్వ ఒప్పందాన్ని యథాతథంగా అమలుచేస్తే ప్రభుత్వానికి 5వందల కోట్ల మేర నష్టం వస్తుందని మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. ఇక, సింగిల్ బిడ్ ఆక్షన్ ద్వారా భూములు కట్టబెట్టడం ఒక తప్పయితే పర్యావరణ చట్టాలను లులు కంపెనీ ఉల్లంఘించడం మరో తప్పు అన్నారు. పైగా ఈ భూములు కోర్టు వివాదంలో ఉండటంతోనే భూకేటాయింపులను రద్దుచేసినట్లు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories