Top
logo

ఐపీఎస్‌ లను బదిలీ చేసిన ఏపీ ప్రభుత్వం

ఐపీఎస్‌ లను బదిలీ చేసిన ఏపీ ప్రభుత్వం
Highlights

రాష్ట్రంలో వేర్వేరు విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న ఆరుగురు ఐపీఎస్‌ అధికారులను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది....

రాష్ట్రంలో వేర్వేరు విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న ఆరుగురు ఐపీఎస్‌ అధికారులను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రకాశం, కడప జిల్లాల ఎస్పీలకు స్థానం చలనం కల్పిస్తూ వారి స్థానాల్లో కోయ ప్రవీణ్‌, రాముల్‌ దేశ్‌ శర్మ లను నియమించింది. విజయవాడ సిటీ జాయింట్‌ కమిషనర్‌గా నవదీప్‌సింగ్‌, పర్సనల్‌ ఐజీగా వినీత్‌ బ్రిజ్‌ లాల్‌, గ్రేహౌండ్‌ గ్రూప్‌ కమాండర్‌గా అభిషేక్‌ మహంతి, విశాఖ గ్రేహౌండ్‌ గ్రూప్‌ కమాండర్‌గా సత్య ఏసుబాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలావుంటే తక్కువ సమయంలోనే ప్రకాశం, కడప ఎస్పీలను బదిలీ చేయడం విశేషం.

Next Story