సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం షాక్

సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం షాక్
x
Highlights

సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం షాక్ సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం షాక్

ఏపీలో ఇటీవల ఎంపికైన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌లో ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఉద్యోగాలు పొందిన వారు రెండేళ్లు ప్రొబేషనరీ ఉంటుందని.. ప్రతి ఉద్యోగి మూడేళ్లు తప్పనిసరిగా పనిచేయాలని.. అనుకోని కారణాల వలన ఉద్యోగం మధ్యలో మానేస్తే వారికి అందించిన గౌరవ వేతనంతో పాటు శిక్షణ కోసం ప్రభుత్వం చేసిన ఖర్చులు తిరిగి చెల్లించాలని పేర్కొంది. దీంతో అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు పొందిన అభ్యర్థులు అయోమయంలో పడ్డారు. ప్రొబేషనరీ పీరియడ్‌ లోపు పెద్ద ఉద్యోగం వస్తే ఏంటి అన్నది వారిని ప్రశ్నార్ధకంలో పడేసింది. సీఎం జగన్ కూడా జనవరిలో వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఉంటుందని అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లలో ఇలా ఉండటం చూసి వారు అవాక్కవుతున్నారు. ఇప్పటికే గ్రూప్‌-2, 3 పరీక్షలు రాసిన వారు ఫలితాల్లో మంచి మార్కులొస్తే ఆ ఉద్యోగాలకు వెళ్లే అవకాశముంది. ఈ నేపథ్యంలో అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌లో ఈ నిబంధనలు పెట్టడంతో అయోమయం నెలకొంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories