వర్ల రామయ్యకు నెలరోజులు గడువిచ్చిన ఏపీ ప్రభుత్వం

వర్ల రామయ్యకు నెలరోజులు గడువిచ్చిన ఏపీ ప్రభుత్వం
x
Highlights

వర్ల రామయ్యకు నెలరోజులు గడువిచ్చిన ఏపీ ప్రభుత్వం వర్ల రామయ్యకు నెలరోజులు గడువిచ్చిన ఏపీ ప్రభుత్వం

ఏపీలో ప్రభుత్వం మారినా టీడీపీ సీనియర్‌ నేత, ఏపీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ‍్య మాత్రం ఆ పదవిని అంటిపెట్టుకునే ఉన్నారు. పలుమార్లు ఆ పదవి నుంచి వైదొలగాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసినా ఆయన మాత్రం అలానే అంటిపెట్టుకొని ఉన్నారు. ఈ నేపథ్యంలో వర్ల రామయ్యకు ఏపీ ప్రభుత్వం నెల రోజులు గడువు ఇస్తూ మరోసారి నోటీసులు జారీ చేసింది. అలాగే విజయవాడ జోనల్‌ చైర్మన్‌ పార్థసారధికి కూడా ఒక నెల గడువిస్తూ ఆర్టీసీ నోటీసులు ఇచ్చింది. వాస్తవానికి ఏప్రిల్‌ 24, 2019లో రామయ్య పదవి ముగిసినా ఇంకా కొనసాగుతున్నారు. దీంతో ఏపీఎస్‌ ఆర్టీసీ 1950 చట్టం సెక్షన్‌-8లోని ఉప నిబంధన-2 ప్రకారం నెల రోజుల గడువిస్తూ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు నిన్న నోటీసు జారీ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories