4 జీ సిమ్‌ల కొనుగోళ్లలో ఏపీ సర్కారు రివర్స్‌టెండరింగ్‌

4 జీ సిమ్‌ల కొనుగోళ్లలో ఏపీ సర్కారు రివర్స్‌టెండరింగ్‌
x
Highlights

-గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు.. 4 జీ సిమ్‌ల కొనుగోళ్లలో రివర్స్‌ టెండరింగ్‌ -ఖజానాకు 33.76 కోట్ల ఆదాయం రూ. 199 బేసిక్‌ ప్లాన్‌కు టెండర్‌ 87.77 కోట్లకు బిడ్ దాఖలు చేసిన ఎల్ వన్ సంస్థ -రివర్స్‌ టెండరింగ్‌తో ఒక్కో సిమ్‌పై రూ. 107 ఆదా -మూడేళ్ల కాలపరిమితితో 4జీ సిమ్‌లు కొనుగోలు చేసిన ఏపీటీఎస్ -బిడ్డింగ్‌ను చేజిక్కించుకున్న ఎయిర్‌టెల్‌ సంస్థ

ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ విభాగాల్లో రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తున్న ప్రభుత్వం.. తాజాగా 4 జీ సిమ్‌ల టెండర్లలో కూడా అదే పద్దతిని అనుసరించనుంది. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు 4 జీ సిమ్‌ల కొనుగోళ్లలో రివర్స్‌ టెండరింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో రాష్ట్ర ఖజానాకు 33 కోట్ల 76 లక్షల ఆదాయం సమకూరింది. 199 రూపాయల బేసిక్‌ 4 జీ సిమ్‌ కొనుగోలుకు.. రివర్స్‌ టెండరింగ్‌కు పిలవగా.. ఎల్ వన్ అనే సంస్థ.. 87 కోట్ల 77 లక్షలకు బిడ్ దాఖలు చేసింది. 199 నెలసరి ప్లాన్‌ను 92 రూపాయల 4 పైసలకే ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. రివర్స్‌ టెండరింగ్‌తో ఒక్కో సిమ్‌తో నెలకు 107 రూపాయలు ఆదా అవుతోంది. మొత్తం 2 లక్షల 64 వేల 920.. ఫోర్ జీ సిమ్‌లను కొనుగోలు చేశారు. ఈ బిడ్డింగ్‌ను.. ఎయిర్‌టెల్ సంస్థ చేజిక్కించుకుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories