జగన్ సర్కార్ ఆఫర్... లోగో డిజైన్ చేయండి.. రూ.50 వేలు గెలవండి..

జగన్ సర్కార్ ఆఫర్... లోగో డిజైన్ చేయండి.. రూ.50 వేలు గెలవండి..
x
Highlights

ఏపీ బ్రాండ్ ఇమేజ్ ని మరింత పెంచేందుకు జగన్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే లోగోను తయారు చేయాలనీ ప్రజలను కోరింది. దీనికి సంబంధించిన ట్యాగ్...

ఏపీ బ్రాండ్ ఇమేజ్ ని మరింత పెంచేందుకు జగన్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే లోగోను తయారు చేయాలనీ ప్రజలను కోరింది. దీనికి సంబంధించిన ట్యాగ్ లైన్ కూడా పెట్టాలని సూచించింది. ఇందులో మూడు ఎంట్రీలకు గాను నగదు బహుమతి ఉంటుందని ప్రకటించింది.అందులో భాగంగా మొదటి బహుమతిగా రూ.50 వేలు , రెండో బహుమతిగా రూ.25 వేలు, మూడో బహుమతిగా రూ.15 వేల నగదు బహుమతి ఉంటుందని ప్రకటించింది. లోగో డిజైన్ చేసినవారు అక్టోబర్ 28లోగా దాఖలు చేయాలని ప్రకటించింది . ఆంధ్రప్రదేశ్ సీఎం ఫేస్‌బుక్ పేజీ ద్వారా ఈ వివరాలను వెల్లడించింది.

దీనికి గాను కొన్ని కండిషన్లను పెట్టింది.

* భారత పౌరులు ఎవరైనా ఈ పోటీలో పాల్గొనవచ్చని తెలిపింది...

* వ్యక్తిగతం లేదా టీమ్ ప్రాజెక్టుగానైనా ఇందులో పాల్గొనవచ్చు... కానీ ఆధార్ కార్డుతో వ్యక్తిగతంగానే దరఖాస్తు చేసుకోవాలి

* లోగో ఒరిజినల్‌ అయి ఉండాలి...కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘించవద్దు .. ఒకవేళ కాపీరైట్ చట్టాన్ని ఉల్లంగిస్తే మాత్రం దాన్ని డిజైన్ చేసినవారే బాధ్యత వహించాలి .

ఈ లోగోను ప్రభుత్వంలోని అన్ని విభాగాలు లేదా కొన్ని విభాగాలు ఉపయోగించుకుంటాయని సర్కారు తెలిపింది.విజేతలను ఈమెయిల్ ద్వారా ప్రకటిస్తామని తెలిపింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories