రైతు భరోసాకు నిధుల విడుదల.. బ్యాంకులు అలా చేసేందుకు కుదరదు..

రైతు భరోసాకు నిధుల విడుదల.. బ్యాంకులు అలా చేసేందుకు కుదరదు..
x
Highlights

రైతు భరోసాకు నిధుల విడుదల.. బ్యాంకులు అలా చేసేందుకు కుదరదు.. రైతు భరోసాకు నిధుల విడుదల.. బ్యాంకులు అలా చేసేందుకు కుదరదు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న 'వైఎస్ఆర్ రైతు భరోసా' పథకం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఆదివారం ఈ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 5,510 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కే సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని ఆయా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు ఆయన తెలిపారు.అయితే రైతులు క్రితం చెల్లించాల్సిన బకాయిలకు ఈ డబ్బును జమ చేసుకోవడానికి వీలు లేకుండా బ్యాంకులతో ప్రభుత్వం మాట్లాడినట్టు తెలిపారు. ఇప్పటికే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేసిన విషయాన్నీ గుర్తుచేశారు.

రైతు భరోసా పథకం ప్రధానమంత్రి కిసాన్ యోజనతో అనుసంధానం చేసి అమలు చేస్తున్నట్టు వ్యవసాయశాఖా మంత్రి కన్నబాబు వెల్లడించారు. రైతు భరోసా పథకానికి 50 లక్షల మందికి పైగా అర్హత సాధించారని.. 7 లక్షల మంది కొత్త రైతులు రైతు భరోసాలో పేర్లు నమోదు చేసుకున్నారని, పిఎం కిసాన్ యోజన పధకంలో అర్హత లేని పేర్లు కూడా నమోదైనట్టు మంత్రి స్పష్టం చేశారు. ఈ నెల 15వ తేదీన నెల్లూరు సమీపంలోని కాకుటూరులో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. అ తర్వాత కౌలు రైతులకు కార్డులు పంపిణీ చేస్తారు. అనంతరం రైతులకు రైతు భరోసా కింద వ్యవసాయ పెట్టుబడి సాయంగా చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత బహిరంగసభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories