రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది
x
Highlights

* రైతుల ఖాతాల్లోకి 1,766 కోట్ల నిధులు జమ చేశాం * గత టీడీపీ ప్రభుత్వం రైతులను మోసం చేసింది * మొదటి నుంచి వైసీపీ రైతుపక్షపాత పార్టీ

వైఎస్సార్‌ రైతుభరోసా - పీఎం కిసాన్‌ మూడో విడత నిధులు, నివర్‌ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం మూడు విడతల్లో 13వేల 500 పెట్టుబడి సాయం అందిస్తానన్న జగన్‌ సర్కార్‌.. ఇప్పటికే రెండు విడతల్లో 11వేల 500 చెల్లించగా.. ఇవాళ మూడో విడతలో భాగంగా అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో 2వేలు చొప్పున జమ చేసింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్‌ మూడో విడత నిధులను కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. దీని ద్వారా 51 లక్షల 59 వేల మంది రైతులు లబ్ది పొందారు. అలాగే.. నివర్‌ తుపాను వల్ల 12.01 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ కింద 646 కోట్ల నిధులు విడుదల చేశారు సీఎం జగన్. పంట నష్టపోయిన రైతుల అకౌంట్లలోకి 646 కోట్ల నిధులు విడుదల చేసింది.

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని సీఎం జగన్‌ అన్నారు. రైతుల అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఆయన.. 19 నెలల్లో రైతుల కోసం 61వేల 400 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. వైసీపీ మొదటి నుంచి రైతు పక్షపాత పార్టీ అని స్పష్టం చేశారు. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు సీఎం జగన్.


టీడీపీ, చంద్రబాబుపై నిప్పులు చెరిగారు సీఎం జగన్. గత టీడీపీ హయాంలో రైతులు మోసపోయారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రాభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షం నేతలు డ్రామాలాడుతున్నారంటూ ఫైర్‌ అయ్యారు సీఎం. చంద్రబాబు జూమ్‌కు దగ్గరగా.. భూమికి దూరంగా ఉంటారని.. రైతుల కష్టాలు ఆయనకు పట్టవని దుయ్యబట్టారు.


Show Full Article
Print Article
Next Story
More Stories