2020 ఏడాది సెలవులు ఇవే..

2020 ఏడాది సెలవులు ఇవే..
x
Highlights

వచ్చే ఏడాది (2020)కి సంబంధించిన సాధారణ, ఐచ్ఛిక సెలవులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఇందులో సాధారణ సెలవులు, ఐచ్ఛిక...

వచ్చే ఏడాది (2020)కి సంబంధించిన సాధారణ, ఐచ్ఛిక సెలవులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఇందులో సాధారణ సెలవులు, ఐచ్ఛిక సెలవులతోపాటు నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ చట్టం కింద సెలవులను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇందులో ఐదు పండగలు సెలవు దినాల్లో వచ్చాయి. వారాంతపు సెలవురోజుల్లో ఇవి వచ్చాయి.

దీంతో ఉద్యోగులు ఆ సెలవులు కోల్పోయినట్టే భావించాలి. ఇందులో ఆదివారం సెలవుల్లో రిపబ్లిక్‌ డే, బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి, మొహర్రం, విజయదశమి పండగలు ఉంటే.. దీపావళి పండుగ రెండో శనివారం రాబోతుంది. ఇవే కాదు మరో ఐచ్ఛిక సెలవు(బసవ జయంతి) కూడా ఆదివారమే వస్తుంది.

2020 సెలవులు..

జనవరి 14 (మంగళవారం) - బోగీ

జనవరి 15(బుధవారం) - సంక్రాంతి/పొంగల్

జనవరి16 (గురువారం) - ​‍కనుమ

ఫిబ్రవరి 21(శుక్రవారం) - మహాశివరాత్రి

మార్చి 25(బుధవారం) - ఉగాది

ఏప్రిల్ 02 (గురువారం) - శ్రీరామ నవమి

ఏప్రిల్ 10(శుక్రవారం) - గుడ్‌ఫ్రైడే

ఏప్రిల్ 14(మంగళవారం) - అంబేడ్కర్ జయంతి

మే 25 (సోమవారం) - ఈదుల్ ఫితర్(రంజాన్)

ఆగస్టు 1 (శనివారం) - ఈదుల్ అజా(బక్రీద్)

ఆగస్టు 11 (మంగళవారం) - శ్రీకృష్ణాష్టమి

ఆగస్టు 15(శనివారం) - స్వాతంత్య్ర దినోత్సవం

ఆగస్టు 22 (శనివారం) - వినాయక చవితి

అక్టోబర్ 02(శుక్రవారం) - గాంధీ జయంతి

అక్టోబర్ 24 (శనివారం) - దుర్గాష్టమి

అక్టోబర్ 30 (శుక్రవారం) - మిలాద్ ఉన్ నబీ

డిసెంబర్ 25(శుక్రవారం) - క్రిస్మస్

రెండో శనివారం, ఆదివారం సెలవులు..

జనవరి 26(ఆదివారం) గణతంత్ర దినోత్సవం

ఏప్రిల్ 5(ఆదివారం) బాబు జగ్జీవన్ రాం జయంతి

ఆగస్టు 30 (ఆదివారం) మొహర్రం

అక్టోబర్ 25 (ఆదివారం) విజయదశమి

నవంబర్ 14 (రెండో శనివారం) దీపావళి

ఐచ్ఛిక సెలవులు..

జనవరి 1(బుధవారం) - నూతన సంవత్సరం

మార్చి 10 (మంగళవారం) - హోలీ

మార్చి 23(సోమవారం) - షబ్-ఏ-మేరాజ్

ఏప్రిల్ 06 (సోమవారం) - మహవీర్ జయంతి

ఏప్రిల్ 09 (గురువారం) - షబ్-ఏ-బరాత్

ఏప్రిల్ 26 (ఆదివారం) - బసవ జయంతి

మే 07 (గురువారం) - బుద్ధపూర్ణమి

మే 14 (గురువారం) - షహదత్ హజ్రత్ అలీ

మే 21 (గురువారం) - షబ్-ఏ-ఖదర్

మే 22 (శుక్రవారం) - జుమతుల్ విదా

జూన్ 23 (మంగళవారం) - రథయాత్ర

జూలై 31 (శుక్రవారం) - వరలక్ష్మీ వ్రతం

ఆగస్టు 7 (శుక్రవారం) - ఈద్-ఏ-గధీర్

ఆగస్టు 20( గురువారం) - పార్శి కొత్త ఏడాది రోజు​

ఆగస్టు 29 (శనివారం) 9 -మొహర్రం

సెప్టెంబర్‌17 (గురువారం) - మహాలయ అమావాస్య

అక్టోబర్ 08 (గురువారం) - అర్బాయిన్

నవంబర్ 27 (శుక్రవారం) -యాజ్ దుహమ్ షరీష్

నవంబర్‌30(సోమ) - కార్తీక పూర్ణిమ/గురునానక్‌ జయంతి

డిసెంబర్ 24( గురువారం) - క్రిస్మస్ ఈవ్

డిసెంబర్‌ 26(శనివారం) - బాక్సింగ్‌ డే


Show Full Article
Print Article
More On
Next Story
More Stories