ఇకనుంచి ఇంజనీరింగ్‌ ఐదేళ్లు, డిగ్రీ నాలుగేళ్లు..

ఇకనుంచి ఇంజనీరింగ్‌ ఐదేళ్లు, డిగ్రీ నాలుగేళ్లు..
x
Highlights

ఇకనుంచి ఏపీలో ఇంజనీరింగ్‌ ఐదేళ్లు, డిగ్రీ నాలుగేళ్లుగా ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా శాఖ యోచిస్తోంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి వైయస్...

ఇకనుంచి ఏపీలో ఇంజనీరింగ్‌ ఐదేళ్లు, డిగ్రీ నాలుగేళ్లుగా ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా శాఖ యోచిస్తోంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నత విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఈ అంశంపై తగిన నైపుణ్యాలు లేవని ఉన్నత విద్యా శాఖ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో, అన్ని అంశాలలో నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ఒక సంవత్సరం అప్రెంటిస్ కోర్సును ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టడానికి అధికారులు చర్యలు ప్రారంభించారు. ఆరవ సెమిస్టర్‌లో గ్రాడ్యుయేట్ కోర్సులు, ఇతర నైపుణ్యాలలో "లైఫ్ స్కిల్ సిలబస్" ను ప్రవేశపెట్టాలని విద్యా శాఖ కూడా ఆలోచిస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories