స్థానిక సంస్థల ఎన్నికల పిటిషన్: విచారణ బెంచ్‌ మార్పు

స్థానిక సంస్థల ఎన్నికల పిటిషన్: విచారణ బెంచ్‌ మార్పు
x

సుప్రీం కోర్ట్ ఫైల్ ఫోటో 

Highlights

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తీవ్ర దుమారం రేగుతోంది.

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తీవ్ర దుమారం రేగుతోంది.ఎన్నికలపై పార్టీల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు నిర్వహించాల్సిందే అని ప్రతిపక్షాలు.. ఇప్పుడు కుదరదని జగన్‌ ప్రభుత్వం..హైకోర్టు తీర్పు అనంతరం ఎస్‌ఈసీ ఎన్నికల షెడ్యూల్‌ కూడా అనౌన్స్ చేసింది. అయినా పంచాయతీ గొడవ సద్దుమనగడం లేదు. అది వైసీపీ ప్రభుత్వం.. ఎస్‌ఈసీ మధ్య అగ్గిరాజేసింది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య సుధీర్ఘ యుద్ధం కొనసాగుతోంది.

ఎన్నికలు నిర్వహించే తీరుతామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ భీష్మించు కూర్చున్నారు. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ.. జగన్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. జగన్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్.. బెంచ్ మారింది. సోమవారం ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టాల్సి ఉండగా.. చివరి గంటల్లో బెంచ్ మారడం ప్రాధాన్యతను సంతరించుకుంది.మొదట ఈ పిటీషన్.. జస్టిస్ లావు నాగేశ్వర రావు సారథ్యంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి లిస్ట్ అయింది. జస్టిస్ లావు నాగేశ్వర రావుతో పాటు జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ ఇందు మల్హోత్రా ఈ బెంచ్‌లో ఉన్నారు. తాజాగా జస్టిస్ సంజయ్ కిషన్ నేతృత్వంలోని ఇద్దరు సభ్యుల బెంచ్‌కు పిటీషన్ బదిలీ అయింది. జస్టిస్ సంజయ్ కిషన్ బెంచ్‌కు దీన్ని రీలిస్ట్ చేశారు.

ఇదిలా ఉండగా.. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఎస్‌ఈసీకి జలక్‌ ఇచ్చాయి. ఇప్పట్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఖరకండిగా ప్రకటించాయి. అలాగే ఎస్‌ఈసీ తలపెట్టిన వీడియో కాన్ఫరెన్స్ కూడా ఉన్నతాధికారులు హాజరుకాలేదు. 2019 ఓటర్ల జాబితా ఆధారంగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తోంది. అయితే ఒకటిన్నర కాలంలో 18సంవత్సరాలు నిండిన యువత ఓటు హక్కు కోల్పోతుందని ఓ విద్యార్థి హైకోర్టు హౌస్‌ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

మరోవైపు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మాత్రం ఎన్నికలను అడ్డుకుంటే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టు ఇచ్చే ఆదేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories