గ్రామ వలంటీర్లకు ప్రభుత్వం శుభవార్త.. రూ.7,500

గ్రామ వలంటీర్లకు ప్రభుత్వం శుభవార్త.. రూ.7,500
x
Highlights

గ్రామ వలంటీర్లకు ప్రభుత్వం శుభవార్త.. రూ.7,500 గ్రామ వలంటీర్లకు ప్రభుత్వం శుభవార్త.. రూ.7,500

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నియమితులైన గ్రామ/వార్డు వలంటీర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. వారికి నేరుగా బ్యాంకు ఖాతాల్లో అక్టోబర్‌ ఒకటో తేదీన గౌరవ వేతనం జమ చేయనున్నట్టు ప్రకటించింది. ఈమేరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీలో మొత్తం 1,92,848 మంది గ్రామ వలంటీర్లకు గాను 1,85,525 మంది నియామక ప్రక్రియ పూర్తయిందని.. అందులో 1,50,661 మందికి గౌరవ వచ్చేనెల 1 నుంచి చెల్లిస్తున్నట్టు పేర్కొన్నారు.

అయితే వీరంతా ఆగస్టు 15వ తేదీ నుంచి నియమితులయ్యారు కాబట్టి గతనెల, ఈనెల (సెప్టెంబర్‌ 30వ తేదీ మధ్య కాలానికి)కు చెల్లించాల్సిన మొత్తం రూ.7,500 గౌరవ వేతనం అక్టోబర్‌ 1న వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. అయితే కొంతమంది సంబంధిత పత్రాలు సమర్పించని కారణంగా వారికి అక్టోబర్‌ మొదటి వారంలో జమ చేస్తామని ఆయన వెల్లడించారు. ఇదిలావుంటే వలంటీర్లకు మొదటిసారి నెల్లన్నర రోజులకు గాను పెద్దమొత్తంలో రూ.7,500 అందనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories