ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త

ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త
x
Highlights

ఆంధ్రప్రదేశ్ లో మరోసారి నిరుద్యోగులకు శుభవార్త వెలువడింది. మిగిలిపోయిన గ్రామ వాలంటీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను ఈ నెలాఖరులోగా విడుదల చేయాలని...

ఆంధ్రప్రదేశ్ లో మరోసారి నిరుద్యోగులకు శుభవార్త వెలువడింది. మిగిలిపోయిన గ్రామ వాలంటీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను ఈ నెలాఖరులోగా విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. సుమారు 1,94,592 లక్షల పోస్టులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రియేట్ చేసింది. అయితే ఇందులో 1,84,944 మంది అభ్యర్థులు విధుల్లో చేరారు, మిగిలిన 9,648 పోస్టులు మిగిలి ఉన్నాయి. మిగిలిన పోస్టులకు నియామకాలు జరుగుతాయని అధికారులు వెల్లడిస్తున్నారు.

తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా , శ్రీకాకుళంలో అత్యల్ప ఖాళీలు ఉన్నాయి. నోటిఫికేషన్ అక్టోబర్ చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. దీనికి ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే నోటిఫికేషన్ రానుంది. కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వాలంటీర్ వ్యవస్థను ఆగస్టు 15న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories