ఏపీలో నామినేటెడ్ పదవులు.. ​డీసీఎంఎస్‌, డీసీసీబీ చైర్మన్లు వీరే..

ఏపీలో నామినేటెడ్ పదవులు.. ​డీసీఎంఎస్‌, డీసీసీబీ చైర్మన్లు వీరే..
x
Highlights

గత ఎన్నికల్లో పార్టీ టిక్కెట్లు ఆశించి భంగపడిన కొంతమంది నేతలకు, స్వల్ప తేడాతో ఓటమి చెందిన నేతలకు జిల్లా స్థాయి నామినేటెడ్ పదవులు కట్టబెట్టింది వైసీపీ...

గత ఎన్నికల్లో పార్టీ టిక్కెట్లు ఆశించి భంగపడిన కొంతమంది నేతలకు, స్వల్ప తేడాతో ఓటమి చెందిన నేతలకు జిల్లా స్థాయి నామినేటెడ్ పదవులు కట్టబెట్టింది వైసీపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా గన్నవరం వైసీపీ అభ్యర్థి వెంకట్రావు, డీసీసీబీ చైర్మన్ అలాగే ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జి పదవిని ఆశిస్తున్న రావి రామనాథం బాబు డీసీఎంఎస్ చైర్మన్‌గా నియమించారు. ప్రకాశం జిల్లా డీసీసీబీ చైర్మన్ గా కొండెపి నుంచి పోటీ చేసి ఓటమి చెందిన మాదాసి వెంకయ్యను నియమించారు. అలాగే శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలైన మాజీ ఎమ్మెల్యే పిరయా సాయిరాజ్ ను శ్రీకాకుళం జిల్లా డీసీఎంఎస్ చైర్మన్‌గా నియమించారు.

​డీసీఎంఎస్‌ చైర్మన్లు..

శ్రీకాకుళం జిల్లా డీసీఎంఎస్ చైర్మన్‌గా ఇచ్చాపురం మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్‌ నియమితులయ్యారు. శిరువూరు వెంకటరమణరాజు (విజయనగరం), ముక్కాల మహాలక్ష్మి నాయుడు (విశాఖపట్నం), దున్న జనార్దనరావు (తూర్పు గోదావరి), యడ్ల తాతాజీ (పశ్చిమ గోదావరి), ఉప్పాల రాంప్రసాద్‌ (కృష్ణా), కె.హెనీ క్రిస్టీనా (గుంటూరు), ఆర్‌.రామనాథం బాబు (ప్రకాశం), వి.చలపతిరావు (నెల్లూరు), దండు గోపి (కడప), పి.పి.నాగిరెడ్డి (కర్నూలు), పి.చంద్రశేఖర్‌రెడ్డి (అనంతపురం), సామకోటి సహదేవరెడ్డి (చిత్తూరు) నియమితులయ్యారు.

​డీసీసీబీ చైర్మన్లు..

శ్రీకాకుళం డీసీసీబీ చైర్మన్‌ పోస్టు పాలవలస విక్రాంత్‌‌ను వరించింది. మరిసర్ల తులసి (విజయనగరం), సుకుమార్ వర్మ (విశాఖపట్నం), అనంత ఉదయ్ భాస్కర్ (తూర్పుగోదావరి), కవురు శ్రీనివాస్ (పశ్చిమ గోదావరి), గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన యార్లగడ్డ వెంకటరావు (కృష్ణా), రాతంశెట్టి సీతారామాంజనేయులు (గుంటూరు), కొండెపి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాదాసి వెంకయ్య (ప్రకాశం), ఆనం విజయ్ కుమార్ రెడ్డి (నెల్లూరు), ఎం.రెడ్డ మ్మ (చిత్తూరు), మాధవరం రామిరెడ్డి (కర్నూల్), తిరుపాల్ రెడ్డి (కడప), బోయ వీరాంజనేయులు (అనంతపురం)ను నియమించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories