యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కు ఏపీ ప్రభుత్వం కీలక పదవి

యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కు ఏపీ ప్రభుత్వం కీలక పదవి
x
Highlights

మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కు ఏపీ ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. ఆయనను ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా నియమిస్తూ నిర్ణయం...

మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కు ఏపీ ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. ఆయనను ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆయన బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అధికార భాషా సంఘం కొనసాగుతుందని జీవోలో పేర్కొంది ప్రభుత్వం. ఇదివరకే ఆయన ఈ బాధ్యతలు నిర్వర్తించారు. సాహితీవేత్తగా, మాజీ ఎంపీగా తెలుగు ప్రజలకు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ సుపరిచితులు.

Show Full Article
Print Article
Next Story
More Stories