Top
logo

ఎంత అవసరమో అంతే తవ్వుతున్నారు..

ఎంత అవసరమో అంతే తవ్వుతున్నారు..
Highlights

ఏపీలో ఇసుక కొరతతో గత మూడు నెలలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు నిర్మాణదారులు. ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన నూతన...

ఏపీలో ఇసుక కొరతతో గత మూడు నెలలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు నిర్మాణదారులు. ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన నూతన ఇసుక విధానంతో సమస్యనుంచి బయటపడ్డారు. ప్రభుత్వమే నేరుగా ఇసుక సరఫరా చేస్తుండటంతో ఎంత మేర అవసరమో అంత ఇసుక మాత్రమే తవ్వుతున్నారు. దానివలన ఇసుక దుర్వినియోగం కాకుండా ఉంటుంది. గతంలో ఇసుక మాఫియాతో రాష్ట్ర ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లింది. కానీ ఇప్పుడు ప్రభుత్వమే ఇసుక సరఫరా చేస్తుండటంతో ఇటు ప్రభుత్వ ఆదాయం పెరగడమే కాకుండా.. ఎక్కువ ధర చెల్లించి మాఫియా దగ్గర ఇసుక కొనుగోలు చెయ్యాల్సిన పని లేకుండా పోయింది.

ఇసుకను తరలించే ప్రతి వాహనానికి జీపీఎస్‌ పరికరాలు అమర్చింది ప్రభుత్వం. దాంతో ఆ వాహనం ఎక్కడి నుంచి ఎక్కడకు వెళుతుందో స్పష్టంగా తెలిసిపోతుంది. ప్రస్తుతం ప్రజలకు ఎంత ధరతో ఇసుక అందుతుందో కచ్చితంగా అంతకంటే తక్కువ రేటుకే అందించాలి. ఇక రాష్ట్రవ్యాప్తంగా కొత్త విధానం ప్రకారం రీచుల వద్ద టన్ను ఇసుక ధర 375 రూపాయలుగా నిర్ణయించిన ప్రభుత్వం ఇసుక రవాణా ఛార్జీల కింద 4 రూపాయల 90 పైసలుగా నిర్ణయించింది.10కి.మీల లోపు ఇసుక రవాణాకు ట్రాక్టర్లను అనుమతించారు. 13 జిల్లాల్లో 41 స్టాక్‌ పాయింట్లను ఏర్పాటు చేయగా. అక్టోబర్‌ నెలాఖరుకు 70 నుంచి 80 శాతంకు స్టాక్‌ పాయింట్లు పెంచుతామని, దశల వారీగా స్టాక్‌ పాయింట్లు పెరుగుతాయని ప్రభుత్వం చెబుతోంది.


లైవ్ టీవి


Share it
Top