ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి ఆమోదముద్ర!

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి ఆమోదముద్ర!
x
Highlights

ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ ఉద్యోగుల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి ఆమోదముద్ర పడింది. ఏపీఎస్ ఆర్టీసీ సంస్థ వైస్‌ చైర్మన్,...

ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ ఉద్యోగుల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి ఆమోదముద్ర పడింది. ఏపీఎస్ ఆర్టీసీ సంస్థ వైస్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కృష్ణబాబు అధ్యక్షతన శుక్రవారం విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌లో పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆర్టీసీ విలీన ప్రక్రియను ఆమోదిస్తూ పాలక మండలి తీర్మానం చేసింది. అంతకుముందు పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌ ఏర్పాటుకు సంబంధించిన విధి విధానాలను కూడా ఆమోదించింది.

విజయవాడ పాత బస్టాండ్‌ వద్ద ఆర్టీసీ స్థలాన్ని బీఓటీ పద్ధతిలో అభివృద్ధికి ఉద్దేశించిన లీజు అగ్రిమెంట్‌ ను రద్దు చేసింది. బ్రెడ్‌ విన్నర్‌ స్కీం కింద దరఖాస్తుల గడువును తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే తొలి విడతగా రాష్ట్రంలో 350 విద్యుత్‌ బస్సులను ఏర్పాటు చేసే నిర్ణయానికి కూడా బోర్డు ఆమోదం తెలిపింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories