కరోనా గురించి ఆందోళన చెందొద్దు.. కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే..

కరోనా గురించి ఆందోళన చెందొద్దు.. కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే..
x
ఆళ్ల నాని ఫైల్ ఫోటో
Highlights

కరోనా వైరస్ గురించి ఆందోళన చెందవద్దని ఏపీ సీఎం జగన్ అభయమిచ్చారు. వైరస్ నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు...

కరోనా వైరస్ గురించి ఆందోళన చెందవద్దని ఏపీ సీఎం జగన్ అభయమిచ్చారు. వైరస్ నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదు అయిన నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముందు జాగ్రత్తగా ప్రజలు మౌత్ మాస్కులను దగ్గర ఉంచుకోవాలని కోరారు. కరోనాపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఈ సందర్బంగా వైద్య శాఖ మంత్రి అళ్ల నాని మాట్లాడుతూ.. కరేనాపై అందోళ చెందాల్సిన అవరసం లేదన్నారు. కరోనా వస్తే ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా కేసులు నమోదు కాలేదని ఆయన అన్నారు. ఎయిర్‌ పోర్టుల్లోనూ అనుమానితుల నుంచి నమూనాలు సేకరించేలా.. ప్రత్యేక ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు.

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ప్రభుత్వం కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. కరోనాపై ప్రజలకు ఎలాంటి అనుమానాలు ఉన్నా లేదా కరోనా లక్షణాలు కనిపించినా వెంటనే సమాచారం అందించాలని తెలిపింది. పలువురు అధికారుల ఫోన్ నంబర్లు ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తిపై మంగళవారం మధ్యాహ్నం సీఎం జగన్ సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ముందస్తు జాగ్రత్తగా రాష్ట్ర వ్యాప్తంగా 8 ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశామని తెలిపారు. తాజాగా కేంద్రం సూచనల మేరకు ప్రత్యేకంగా ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేశామని మంత్రి వెల్లడించారు. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ల వివరాలు.





Show Full Article
Print Article
Next Story
More Stories