ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు విషయంలో వెనక్కి తగ్గిన ఏపీ సర్కారు

ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు విషయంలో వెనక్కి తగ్గిన ఏపీ సర్కారు
x
Highlights

350 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టే నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఆర్‌టిసి)...

350 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టే నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఆర్‌టిసి) విరమించుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎలక్ట్రిక్ బస్సులను కొనాలని ఏపీఎస్‌ఆర్‌టిసి టెండర్‌ను నిలిపివేసింది. ఒకేసారి 1,000 బస్సులను ప్రవేశపెట్టాలని అనుకున్నారు, కాని తరువాత 'లాజిస్టిక్ కారణాల వల్ల' ఆ సంఖ్యను 350 కి తగ్గించారు. ప్రస్తుతం ఇది కూడా ఆగిపోయింది. మొదటి విడతలో భాగంగా 350 బస్సుల కొనాలనుకుంది. దాంతో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కంపెనీల ప్రతినిధులతో ఆగస్టులో ఆర్టీసీ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఒక్కో బస్సు ధర రూ.1.80 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకూ ఉంటుందని కంపెనీలు పేర్కొన్నాయి. దీంతో బిడ్ లను ఆహ్వానించగా కిలోమీటరుకు రూ.60 వరకూ ఇవ్వాలని కొన్ని కంపెనీలు కోరాయి. దీనికి ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు నో చెప్పారు. ప్రభుత్వం బస్సు నడిపితే కిలోమీటరుకు వచ్చే ఆదాయం రూ.33కి మించదని..

రూ.60 ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. దానికి తోడు ఒక్కో బస్సు రెండు కోట్లకు కొనుగోలు చేస్తే కేంద్రం సబ్సిడీ ఇచ్చినా మైంటెనెన్సు కు తడిసిమోపెడవుతుంది. ఒకవేళ దైర్యం చేసి ప్రవేశపెట్టినా రీచార్జి స్టేషన్ల ఏర్పాటుకు అదనంగా మరో రూ.200 కోట్లు ఖర్చు చేయాలి.. అయినా బస్సు నడిపితే మాత్రం కిలోమీటరుకు రూ.32 నుంచి 33 మాత్రమే వష్తుందని.. పెట్టె ఖర్చుతో పోల్చుకుంటే భారీ నష్టమే మిగులుతుందని అధికారులు తేల్చారు. ఈ విషయాన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఈ ప్రతిపాదనను నిలిపివేసినట్టు తెలుస్తోంది. కాగా పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ బస్సులు కొనుగోలు చేసే రవాణా సంస్థలు, ప్రైవేటు వ్యక్తులకు భారీ సబ్సిడీ ప్రకటించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories