నేడు ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్‌పై విచారణ.. ఎలాంటి తీర్పు ఇచ్చినా సంచలనమే..

నేడు ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్‌పై విచారణ.. ఎలాంటి తీర్పు ఇచ్చినా సంచలనమే..
x

ap high court

Highlights

ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఇవాళ కోర్టులో పిటిషన్ విచారణకు రానుంది.

ఏపీలో స్థానిక ఎన్నికల ఆంశం రాజకీయంగా హీటెక్కిస్తుంది. పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని ఒకవైపు నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఉండగా.. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించి అధికారులు బిజీగా ఉన్నారని ప్రస్తుత సమయంలో ఎన్నికలు నిర్వహించడం సరైంది కాదని ప్రభుత్వం వాదిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఇవాళ కోర్టులో పిటిషన్ విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరుగుతాయా లేదా అన్నది ఇవాళ స్ఫష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనిపై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చినా అది సంచలనమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరోవైపు ఉద్యోగ సంఘాల నేతలు సైతం ఎన్నికలను బహిరంగంగానే వ్యతిరేకించారు. కరోనా సెకండ్‌వేవ్, బర్డ్‌ ఫ్లూ భయాందోళనల్లో ప్రజలున్నారని, ఇలాంటి సమయంలో ఉద్యోగుల్ని సంప్రదించకుండా విడుదల చేసిన షెడ్యూల్‌ను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ను డిమాండ్‌ చేశారు. రోనా వ్యాక్సినేషన్‌ పూర్తయిన తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కోరారు. నిమ్మగడ్డ మొండిగా వ్యవహరిస్తే ఎన్నికలను బహిష్కరించి కోర్టుకు వెళ్తామని ఉద్యోగ సంఘలా నేతలు హెచ్చరించారు.

కరోనా వ్యాక్సినేషన్ నేపథ్యంలో స్థానిక ఎన్నికలపై ఉద్యోగ సంఘాలు విముఖత వ్యక్తం చేస్తుండడంపై ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ స్పందించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ లేఖ కూడా రాశారు. పోలింగ్ సిబ్బంది కరోనా బారినపడకుండా అన్ని రకాల భద్రత చర్యలు తీసుకుంటామని హామీ చేశారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ నేపథ్యంలో పోలింగ్ సిబ్బందికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్టు వెల్లడించారు. పోలింగ్ సిబ్బందికి పీపీఈ సూట్లు, మాస్కులు అందిస్తామని వివరించారు. ఏపీ ఉద్యోగులు ఎవరికీ తీసిపోరని, ప్రకృతి విపత్తుల సమయంలోనూ ఎంతో కష్టించి పనిచేసిన ఘనత ఏపీ ఉద్యోగుల సొంతం అని నిమ్మగడ్డ కొనియాడారు.

ఏపీలో పంచాయతీ ఎన్నికలకు ఎస్ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ నెల 9వ తేదీ నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. దీంతో రాష్ట్రప్రభుత్వ యంత్రాంగమంతా ఎన్నికల సంఘం పరిధిలోకి వచ్చింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 23న పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంది. ప్రభుత్వ పెద్దలు సహకరించేదని తేల్చి చెబుతున్నారు. ఇక షెడ్యూల్‌ విడుదలైనందున ఎన్నికలు వాయిదాపై హై కోర్టు ఇచ్చే తీర్పు ఎలా ఉంటుంది అనేది సర్వాత్ర ఆసక్తిగా మారింది. కోర్టు తీర్పు ఎవరికి ప్రతికూలంగా ఉన్నా.. వారు మళ్లీ ధర్మాసనాన్ని ఆశ్రయించే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories