ఆ రుణాలు మాఫీ చేయండి..

ఆ రుణాలు మాఫీ చేయండి..
x
Highlights

ఈ నెల 18, 19, 20వ తేదీల్లో 15వ ఆర్ధిక సంఘం ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు. ఈ మూడు రోజుల్లో మొదటిరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో...

ఈ నెల 18, 19, 20వ తేదీల్లో 15వ ఆర్ధిక సంఘం ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు. ఈ మూడు రోజుల్లో మొదటిరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమాసవేశంలో రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులపై ముఖ్యమంత్రి వారికి వివరిస్తారు. అలాగే పలు విన్నపాలు కూడా చేయనున్నారు. ప్రధానంగా కేంద్రానికి రాష్ట్రం చెల్లించాల్సిన అప్పులను మాఫీ చేయాలని విజ్ఞప్తి చేయనుంది. అలాగే రూ.39,423 కోట్ల విలువైన 2,72,266 బిల్లులను పెండింగ్‌లో ఉండటం వలన ప్రస్తుత ఆర్థిక ఏడాది బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడిందని.. కేంద్రం నుంచి సాయం చెయ్యాలని కోరనుంది.

నవరత్నాల ద్వారా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రత్యేక నిధులు కోరనుంది. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ కోసం ప్రత్యేకంగా రూ.5,950 కోట్ల కేంద్ర సాయం కోరనుంది. 15వ ఆర్థిక సంఘం కాల వ్యవధిలో గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.28,382 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.27,820 కోట్ల గ్రాంటును రాష్ట్రానికి ఇవ్వాల్సిందిగా కోరతారు. కేంద్ర పన్నుల వాటాను 42 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని కోరనుంది. అలాగే భూ రికార్డుల ప్రక్షాళనకు సర్వే చేసేందుకు చట్టం తీసుకొచ్చారు.. అయితే దీనికి రూ.1,667 కోట్ల కేంద్ర సాయం రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. గతంలో పంజాబ్‌ రాష్ట్రానికి చేసిన తరహాలోనే రాష్ట్రానికి చెందిన రూ.11,039 కోట్ల కేంద్ర రుణాలు మాఫీ చెయ్యాలని కోరనుంది.

అంతేకాదు రాష్ట్రంలో నూతనంగా విద్య, వైద్య కళాశాలలు ఏర్పాటు చేసేందుకు భారీగా ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. రాబోయే ఆర్ధిక లోటును లెక్కించి ఈ సంఘం ముందు ఉంచనుంది.. ఇదేక్రమంలో గతంలో రావలసిన నిధులపై కూడా చర్చించనుంది. గోదావరి, కృష్ణా అనుసంధానం కోసం కేంద్ర నిధులను ప్రభుత్వం ఆశిస్తోంది. ఇందులో భారీగా సాయం చేసేలా కేంద్రానికి సిఫారసు చెయ్యాలని ఆర్ధిక సంఘాన్ని ప్రభుత్వం కోరనుంది. ఇలా అనేక అంశాల్లో కేంద్రం నుంచి భారీ సాయాన్ని ఏపీ ప్రభుత్వం ఆశిస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories