పునర్జన్మనిచ్చిన సీఎం జగన్..

పునర్జన్మనిచ్చిన సీఎం జగన్..
x
Highlights

పద్నాలుగు నెలల పాటు పాక్ చెరలో బందీలుగా ఉన్న సిక్కోలు మత్స్యకారులకు విముక్తి కలిగింది.

పద్నాలుగు నెలల పాటు పాక్ చెరలో బందీలుగా ఉన్న సిక్కోలు మత్స్యకారులకు విముక్తి కలిగింది. గుజరాత్‌లోని వీరావలి ప్రాంతానికి వేట కోసం వెళ్లిన మత్స్యకారులు పాక్ కోస్టు గార్డులకు చిక్కారు. అప్పటి నుంచీ శ్రీకాకుళం జిల్లా డి.మత్స్యలేశం గ్రామానికి చెందిన బాధిత కుటుంబాలు తీవ్ర మనోవేధనకు గురయ్యాయి. తమ వారిని విడిపించాలంటూ 14 నెలలుగా అధికారుల చుట్టూ తిరిగిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. వాఘా సరిహద్దు వద్ద సిక్కోలు మత్స్యకారులను భారత విదేశాంగ శాఖ అధికారులకు పాక్ అప్పగించారు. దీంతో పాకిస్తాన్‌ చెరలో గడిపిన ఆంధ్రా జాలర్లు ఎట్టకేలకు సోమవారం స్వదేశానికి చేరుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తమకు పునర్జన్మ ప్రసాదించారని పాక్‌ జైలు నుంచి విడుదలై ఢిల్లీ చేరుకున్న 20 మంది మత్స్యకారులు, వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. 14 నెలల తర్వాత తమ కుటుంబ సభ్యులను కలుసుకోబోతున్నందుకు ఆనందించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అనుకోకుండా పాకిస్తాన్ కోస్టుగార్డులకు చిక్కామని అక్కడి నుంచి బయటకు వస్తామో లేదోనని చాలా భయపడ్డాం అని వారు తెలిపారు. తమ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషితో తామంతా బయటికి రాగలిగాం అని చెప్పారు. తమని కరాచీలోని లాండీ జైల్లో ఉంచారని. వారితో అనేక పనులు చేయించుకున్నారని వారు తెలిపారు.

బండచాకిరి చేయించుకుని కనీసం సమయానికి తిండి కూడా పెట్టలేదని వారు వాపోయారు. తల్లి మాకు జన్మనిస్తే.. వైఎస్‌ జగన్‌ పునర్జన్మనిచ్చారని తెలిపారు. వారికి చేపలు పట్టడం తప్ప మరో జీవనోపాధిలేదని, అందుకే వారు చేపల వేటకు అంత దూరం వెల్లామని తెలిపారు. ప్రభుత్వం తమ ఉపాధికి అవసరమయిన జెట్టీలను అందజేయాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories