logo
ఆంధ్రప్రదేశ్

లోలోపల మధనపడుతున్న ఐదుగురు మాజీ మంత్రులు..! అవమానంగా ఫీల్ అవుతున్నారా..?

AP Ex-Minister Disappointment on YS Jagans New Cabinet | Live News
X

లోలోపల మధనపడుతున్న ఐదుగురు మాజీ మంత్రులు..! అవమానంగా ఫీల్ అవుతున్నారా..?

Highlights

AP Ex-Ministers: మూడేళ్లుగా ప్రభుత్వంపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టిన నేతలు...

AP Ex-Ministers: ఏపీలో కొత్త కేబినెట్ కొలువుదీరింది. అయితే పాత కేబినెట్‌లో పలువురిని తప్పిండంతో ఇప్పటికే బాహటంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే గత కేబినెట్‌లో ఐదుగురు నేతలు కీలకంగా ఉన్నారు. ఇప్పడు వారు మాజీలయ్యారు. వారే కన్నబాబు, కొడాలి నాని, పేర్నినాని, వెల్లంపల్లి, అనిల్ కుమార్. మూడేళ్లుగా ప్రభుత్వంపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టిడంలో వీరు సమర్ధులు. కీలక విషయాల్లో వీళ్లదే బలమైన స్థానం.

చంద్రబాబుకి గట్టిగా కౌంటర్ ఇవ్వాలంటే కొడాలి నాని, లోకేష్‌కు అనిల్ కుమార్, పవన్‌కు పేర్నినాని, బీజేపీకి వెల్లంపల్లి, ఆల్ ఇన్ వన్‌గా కన్నబాబు ఇలా వీరంతా అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని ఈ ఐదుగురు ముందుండి నడిపించారు. గత కేబినెట్‌లో టాప్ 5లో ఉన్న మంత్రులు వీరే. గత కేబినెట్‌లో టాప్ 5లో ఉన్న మంత్రులు వీరే. అలాంటి వారిని కొనసాగించకపోవడంతో లోలోపల మధనపడుతున్నట్లు తెలుస్తోంది. పైకి మాములుగా కనిపిస్తున్నా.. స్టేట్‌మెంట్స్ ఇస్తున్నా.. లోపల బాధపడుతున్నారని టాక్. పాత వాళ్లను 11 మంది కొనసాగించి వీళ్లను తప్పించడం అవమానంగా ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది.

Web TitleAP Ex-Minister Disappointment on YS Jagan's New Cabinet | Live News
Next Story