AP DSC 2025: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. అప్లై చేసుకోవడానికి వీడియో చూడండి

AP DSC 2025
x

AP DSC 2025: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. అప్లై చేసుకోవడానికి వీడియో చూడండి

Highlights

AP DSC Application Process: ఈరోజు ఉదయం 10 గంటలకు ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ రెండు వెబ్‌సైట్‌లలో అప్లై చేసుకోవచ్చని సూచించారు.

AP DSC Application Process: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ ఎట్టకేలకు ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో విడుదల చేశారు. ఈ మేరకు మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. రెండు అధికారిక వెబ్‌సైట్‌లలో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు. వ్యక్తిగత, విద్యార్హతలు, టెట్‌, బీఈడీ వివరాలు నమోదు చేసి వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 16,347 టీచర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి మే 15 వరకు చివరి తేదీ ఉంది. ఈరోజు నుంచి అప్లికేషన్ ప్రక్రియ మొదలైంది. ఇక జూన్ 6 నుంచి జూలై 6 వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు.

అయితే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులు వల్ల డీఎస్సీ రాస్తున్న అభ్యర్థుల వయో పరిమితి కూడా 42 ఏళ్ల నుంచి 44 ఏళ్ల వరకు పెంచారు. ఇక ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నోటిఫికేషన్ మొత్తంగా 16,347 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా.. ఇందులో 14,088 జిల్లా స్థాయి, 2259 స్టేట్ జోన్, సెకండరీ టీచర్ గ్రేడ్ ఖాళీలు 6,599 జిల్లాల సబ్జెక్టుల వారీగా ఉమ్మడి ఖాళీలు 13 ఉన్నాయి.

ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ కూటమి సర్కారు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు ఈ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసినట్టు మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ తో పాటు దరఖాస్తు చేసుకునే విధానం పూర్తి వివరాలు వీడియోను కూడా ఎంబెడ్‌ చేశారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు ఎలాంటి సందేహం లేకుండా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 20 అంటే నేటి నుంచి మే 15 వరకు స్వీకరిస్తారు. మాక్‌ టెస్టులకు సంబంధించి 20న నిర్వహిస్తారు. ఇక మే 3వ తేదీ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏపీ డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 6 వరకు నిర్వహిస్తారు. ప్రాథమిక కీ కూడా రెండో రోజే అందుబాటులో ఉంటుంది. ఇక ఫైనల్ కీ అభ్యంతరాలు ముగిసిన తర్వాత విడుదల చేయనున్నారు. చివరి జాబితాలో మెరిట్ విడుదల కానుంది.



Show Full Article
Print Article
Next Story
More Stories