
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. వచ్చే నాలుగేళ్లలో 30 లక్షల ఇళ్లు నిర్మించబోతోంది. పేదవాళ్లకు సొంత ఇల్లు కల నేరవేర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా చర్యలు చేపట్టింది. ఉగాది పండగ రోజున 26.6 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వనుంది. అలాగే వచ్చే నాలుగేళ్లలో 30 లక్షలకు పైగా ఇళ్లను నిర్మించాలని నిర్ణయించింది. 2024 నాటికి పేదల సొంతింటి కలను నెరవేర్చే దిశగా ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
తాజాగా ఈ అంశంపై అధికారులతో చర్చించిన సీఎం జగన్ ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు అమలు తీరు గురించి తెలుసుకున్నారు. కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి ఇంకా ఎన్ని గృహాలు మంజూరు కావడానికి ఆస్కారం ఉందో తెలుసుకున్నారు. అలాగే కేంద్రం నుంచి ఇంకా ఎన్ని నిధులు అవసరమవుతాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఇళ్ల పట్టాలు పొందిన వారికి ప్రభుత్వమే ఇళ్లు నిర్మిస్తుంది. గృహ నిర్మాణ కార్యక్రమంలో 4వేల 500 మంది ఇంజినీర్లు పాల్గొనబోతున్నారు. 45,000 మంది గ్రామ సచివాలయ ఉద్యోగులు పాల్గొననున్నారు. ప్రభుత్వం నిర్మించే ఇంట్లో బెడ్ రూం, కిచెన్, వరండా, మరుగుదొడ్లు వంటివి ఉండాలన్నారు. గృహాల నిర్మాణం ఇంటిపై రూ.25 వేల వరకు పావలా వడ్డీకే బ్యాంకు రుణం ఇచ్చేలా బ్యాంకులతో సంప్రదింపులు చేయాలని సూచించారు. ప్రభుత్వం నిర్మించబోయే గృహాలన్ని ఒకే నమూనాలో అత్యంత నాణ్యంగా, అందంగా ఉండేలా నిర్మించాలని అధికారులకు సూచించారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




