ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్, చంద్రబాబు

AP CM YS Jagan And Chandrababu Will Go To Delhi Today
x

ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్, చంద్రబాబు 

Highlights

* సాయంత్రం ప్రధాని మోడీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం

AP CM Jagan: ఏపీ సీఎం జగన్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో ఇవాళ సాయంత్రం జరగనున్న అఖిల పక్ష సమావేశంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. జీ-20 సదస్సు నిర్వహణపై ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 3.15 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు రాష్ట్రపతి భవన్‌లో జీ-20 సదస్సు జరగనుంది. ఈ అఖిలపక్ష సమావేశంలో సీఎం జగన్ పాల్గొంటారు. ఆ తర్వాత రాత్రి 7.55 గంటలకు ఢిల్లీ నుంచి తాడేపల్లికి చేరుకుంటారు.

దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ జరిగే జీ-20 సదస్సులో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. కాసేపట్లో హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని మోడీ అధ్యక్షతన జరగనున్న సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో జరిగే జీ-20 సదస్సుకు సంబంధించి సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories