ఆరోగ్యశ్రీ పైలట్‌ ప్రాజెక్టుకు ఏపీలో నేడు శ్రీకారం

ఆరోగ్యశ్రీ పైలట్‌ ప్రాజెక్టుకు ఏపీలో నేడు శ్రీకారం
x
Highlights

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఏలూరు మండలం వంగాయగూడెంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం.. 11.25 గంటలకు ఏలూరు ఇండోర్‌ స్టేడియంలో వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. చికిత్స వ్యయం రూ.1,000 దాటితే ఈ పథకం వర్తింప చేస్తారు. కొత్తగా 1,000 వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చి, మొత్తం 2,059 వ్యాధులకు వైద్యం అందించే పైలట్‌ ప్రాజెక్టును ఇవాళ ప్రారంభిస్తారు. దీనిపై 3నెలలపాటు వైద్య ఆరోగ్యశాఖ అధ్యయనం చేస్తుంది. ఫలితాలను అనుసరించి ఏడాదిలోగా మిగిలిన జిల్లాలకు వర్తింపజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్ని రకాల క్యాన్సర్లకూ ఈ పథకం వర్తించనుంది.

ఆసుపత్రులతో టై అప్ కార్యక్రమాలు పూర్తి చేసి ఈ నెలాఖరు కల్లా క్యాన్సర్‌ చికిత్సను రోగులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. గతంలో ఈ పథకం కింద చిన్నారులకు ఒక చెవికి మాత్రమే కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్‌ చేసేవారు. ఇప్పుడు దాన్ని రెండు చెవులకూ వర్తింప చేశారు. పాత కార్డులు కూడా ఆరోగ్యశ్రీ పని చేస్తాయి. అయితే వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల పంపిణీ పూర్తయ్యే వరకు మాత్రమే ఇవి పనిచేస్తాయని ప్రభుత్వం పేర్కొంది. అలాగే రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఇవాళ 1.5 లక్షల కొత్త కార్డుల పంపిణీ చేయనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. వార్షికాదాయం రూ.5లక్షలలోపు ఉన్నవారికి 'ఆరోగ్యశ్రీ' వర్తింపు చేశారు. ఇదిలావుంటే గతేడాది నవంబరు నుంచి హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నై నగరాల్లోని సుమారు 150 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభమయ్యాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories