నేడు ఢిల్లీకి వైఎస్ జగన్.. అమిత్ షా తో భేటీ?

నేడు ఢిల్లీకి వైఎస్ జగన్.. అమిత్ షా తో భేటీ?
x
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్బంగా కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సీఎంఓ కార్యాలయం అమిత్ షా అపాయింట్మెంట్ కోరినట్టు తెలుస్తోంది. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం ఈరోజు సీఎం జగన్ అమిత్ షా తో సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఇటీవల రెండు సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్.. షా ను కలవకుండానే వచ్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో అమిత్ షా తో జగన్ భేటీ సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఏపీకి మూడు రాజధానులు చెయ్యాలని జగన్ ప్రభుత్వం దాదాపు డిసైడ్ అయింది. అయితే ప్రతిపక్షాలు అన్ని ఈ ప్రతిపాదనకు అడ్డు చెబుతున్నాయి. పూర్తిస్థాయి రాజధాని అమరావతిలోని ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ కూడా రాజధానిగా అమరావతే ఉండాలని పట్టుబడుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వ పెద్దలు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ఎటువంటి జోక్యం చేసుకోమని తేల్చి చెప్పారు. రాజధాని అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ చెప్పారు. కానీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాత్రం ఇందుకు బిన్నంగా మాట్లాడుతున్నారు.

మరోవైపు మూడు రాజధానుల విషయంలో ఇవాళ జరగాల్సిన ఏపీ క్యాబినెట్ సమావేశం వాయిదా పడింది. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన జరగాల్సిన మంత్రివర్గ భేటీ సోమవారం నాటికి వాయిదా వేశారు. అయితే క్యాబినెట్ భేటీ విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొన్నాయి. మొదట సోమవారం రోజునే మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావించినప్పటికీ దాన్ని ఇవాళ్టికి ప్రీపోన్ చేసింది.

ఆ తర్వాత మరోసారి వాయిదా వేసి.. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందే కేబినెట్ భేటి నిర్వహించాలని ఫైనల్ గా డిసైడ్ అయింది. అదే రోజు హైపవర్ కమిటీ నివేదికను సీఎం జగన్ కు అంద చేయనున్నది. ఈ నివేదిక ఆధారంగానే మంత్రి మండలి సమావేశంలో చర్చ జరగనుంది. కేబినెట్ సమావేశం తర్వాత వికేంద్రీకరణ, మూడు రాజధానులపై స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories