Tirumala: నూతన పరకామణి భవనాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

Tirumala: రూ.23 కోట్లతో దాతల సహకారంతో పరకామణి భవనం నిర్మాణం
x

Tirumala: నూతన పరకామణి భవనాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

Highlights

Tirumala: రూ.23 కోట్లతో దాతల సహకారంతో పరకామణి భవనం నిర్మాణం

Tirumala: ఏపీ సీఎం వైఎస్ జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రికి అర్చకులు, టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. సీఎం వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ఉన్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం నూతనంగా నిర్మితమైన పరకామణి భవనాన్ని జగన్ ప్రారంభించారు. అంతకముందు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మంగళవారం వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. పట్టువస్త్రాలను తలపై పెట్టుకున్న ముఖ్యమంత్రి వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, ఆశ్వ, గజరాజులు వెంట రాగా ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం శ్రీవారి సన్నిధిలో అర్చకులకు పట్టువస్త్రాలను సమర్పించి.. స్వామిని దర్శించుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories