కనెక్ట్‌ టూ ఆంధ్రా వెబ్‌ పోర్టల్‌ ప్రారంభించిన సీఎం జగన్

కనెక్ట్‌ టూ ఆంధ్రా వెబ్‌ పోర్టల్‌ ప్రారంభించిన సీఎం జగన్
x
Highlights

రాష్ట్ర అభివృద్ధి కోసం దాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రవాసాంధ్రుల నుంచి వచ్చే సహాయం కొరకు 'కనెక్ట్‌ టూ ఆంధ్రా' వెబ్‌ పోర్టల్‌ను ఆంధ్రప్రదేశ్‌...

రాష్ట్ర అభివృద్ధి కోసం దాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రవాసాంధ్రుల నుంచి వచ్చే సహాయం కొరకు 'కనెక్ట్‌ టూ ఆంధ్రా' వెబ్‌ పోర్టల్‌ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పోర్టల్ ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. సచివాలయంలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. దాతల సహాయం కోసం ఈ వెబ్‌సైట్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. దీనికి ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా, సీఎస్‌ వైస్‌ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. సొంత ఊరికి లేదా ప్రాంతానికి ఏదైనా చేయాలనుకునే వారు ఈ పోర్టల్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో నమోదైన పేర్లను రాష్ట్రప్రభుత్వం ప్రకటించనుంది. కాగా ఈ పోర్టల్ ను ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి తన సందేశాన్ని ఇచ్చారు..

'రాష్ట్రం మీద మీ ప్రేమాభిమానాలు చూపించడానికి ఇదొక మంచి అవకాశం. మీరు ఎంత సహాయం చేస్తారన్నది ముఖ్యం కాదు. మీ గ్రామానికి లేదా మీ నియోజకవర్గానికి, మీ జిల్లాలో ఏ కార్యక్రమైనా చేపట్టవచ్చు. దానికి ఎంత మొత్తమైనా సహాయం చేయవచ్చు. మెరుగైన రాష్ట్రం కోసం ఎంతోకొంత మంచి చేయడానికి ఖండాతరాల్లో ఉన్న వారంతా ముందుకు రావాలి' అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ విజయ్‌కుమార్, ప్రణాళికా సంఘం డిప్యూటీ సెక్రటరీ కోటేశ్వరమ్మ పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories