
-రేపు ఢిల్లీకి సీఎం జగన్ -ఉ.10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి జగన్ -పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్న జగన్ -ఏపీకి రావాల్సిన నిధులు, విభజన హామీల అమలుపై చర్చ
రేపు సీఎం జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఉదయం 8 గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో జగన్ పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి వెళతారు. ఢిల్లీ పర్యటనలో జగన్ పలువురు కేంద్ర మంత్రులను కలువనున్నారు. విభజన తర్వాత ఏపీకి రావాల్సిన నిధులు, హామీల అమలుపై కేంద్రమంత్రులతో జగన్ చర్చించనున్నారు. గతంలో జగన్ అమిత్ షాతో భేటీ కావాల్సివుంది. అయితే మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా బీజీగా ఉండడంతో సమావేశం వాయుదా పడింది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




