Top
logo

Jagan Tour : ఈనెల 11, 12 తేదీల్లో తిరుమలలో సీఎం జగన్ పర్యటన

AP CM Jagan Tour in Tirupathi on 11 and 12 October 2021
X

ఈనెల 11, 12 తేదీల్లో తిరుమలలో సీఎం జగన్ పర్యటన

Highlights

*భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు *ఒకవైపు బ్రహ్మోత్సవాలు.. మరోవైపు సీఎం పర్యటన

Jagan Tour: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏపీ సీఎం జగన్ ఈనెల 11, 12 తేదీల్లో పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఒకవైపు బ్రహ్మోత్సవాలు మరోవైపు సీఎం పర్యటనతో తిరుమల ఘాట్ రోడ్డును పోలీసులు జల్లెడ పడుతున్నారు. రెండు రోజులలో మొదటి రోజు స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

11న మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుపతి బర్డ్‌ ఆసుపత్రిలో శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఆసుపత్రిని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్దకు చేరుకుని మెట్ల మార్గాన్ని, గో మందిరాన్ని ప్రారంభిస్తారు. టీటీడీ గోపూజను గోవు ప్రాశస్త్యాన్ని మరింతగా విస్తృత పరచడంలో భాగంగా అలిపిరి వద్ద దాతల సహకారంతో గోపూజా మందిరాన్ని ఏర్పాటు చేసింది.

అలాగే రిలయన్స్ సంస్థ సహకారంతో అలిపిరి కాలిబాట మార్గంలో రూఫ్ ను ఆధునీకరించారు. అక్కడి నుంచి బేడీ ఆంజనేయస్వామి ఆలయానికి చేరుమలకుని శ్రీవారికి పట్టువస్త్రాలు తీసుకుని ఆలయంలో స్వామివారికి సమర్పిస్తారు. మరుసటి రోజు ఉదయం విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మహద్వారం ఎదురుగా ఉన్న గొల్లమండపం వద్ద ఎస్వీబీసీ కన్నడ/హిందీ ఛానళ్లు ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి పలు అభివృద్ధి పనులకు శంకు స్థాపన చేసి, అనంతరం తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం జగన్.

Web TitleAP CM Jagan Tour in Tirupathi on 11 and 12 October 2021
Next Story